షాకింగ్ వీడియో: జస్ట్ మిస్.. ప్రాణాలతో బయటపడ్డ BJP ఎంపీ

BJP ఎంపీ ఘోర ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆయన పర్యటనలో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుకు అడ్డంగా పెద్ద పెద్ద బండరాళ్లు విరిగిపడ్డాయి. ఈ సన్నివేశాన్ని ఎంపీతో ఉన్న సిబ్బంది వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
BJP MP Anil Baluni

BJP ఎంపీ ఘోర ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆయన పర్యటనలో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుకు అడ్డంగా పెద్ద పెద్ద బండరాళ్లు విరిగిపడ్డాయి. ఈ సన్నివేశాన్ని ఎంపీతో ఉన్న సిబ్బంది వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరాఖండ్‌లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఏర్పడిన విపత్తు నుంచి బీజేపీ ఎంపీ అనిల్ బలూని తృటిలో తప్పించుకున్నారు. చమోలీ, రుద్రప్రయాగ్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, తిరిగి రుషికేశ్‌కు బయలుదేరిన సమయంలో బద్రినాథ్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీ కాన్వాయ్ ముందే కొండచరియలు విరిగిపడ్డాయి. అది గమనించిన ఎంపీ అనిల్ బలూని తన వాహనాన్ని నిలిపి, పరిస్థితిని సమీక్షించడానికి కారు దిగారు. అక్కడున్న అధికారులను, ప్రజలను వెనక్కి వెళ్ళమని హెచ్చరిస్తున్న సమయంలో, అకస్మాత్తుగా పర్వతం నుండి భారీగా శిథిలాలు, రాళ్ళు కిందికి జారిపడ్డాయి. ఈ ఊహించని పరిణామంతో ఎంపీతో సహా అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురై ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ భయానక అనుభవాన్ని అనిల్ బలూని తన X అకౌంట్‌లో పంచుకున్నారు. "ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లో సంభవించిన భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఏర్పడిన గాయాలు మానడానికి చాలా సమయం పడుతుంది" అని ఆయన పేర్కొన్నారు. ఈ దృశ్యం ఉత్తరాఖండ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని ఆయన అన్నారు.

ఈ విపత్తు సమయంలో ప్రజలందరి క్షేమం కోసం బాబా కేదార్‌నాథ్‌ను ప్రార్థిస్తున్నానని తెలిపారు. అలాగే, ఇటువంటి కఠిన పరిస్థితులలో కూడా అవిశ్రాంతంగా శ్రమిస్తూ రోడ్లపై నుంచి శిథిలాలను తొలగిస్తున్న అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, ఇతర కార్మికులందరి అంకితభావాన్ని ఆయన అభినందించారు.

గత కొద్ది నెలలుగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను ఈ విధమైన ప్రకృతి వైపరీత్యాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘటన, పర్వత ప్రాంతాల్లో ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. ప్రస్తుతం, ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు