Viral: రోజుకు 7 లీటర్ల ఇంజిన్ ఆయిల్ తాగుతున్న స్వామి.. ఎలా బతుకుతున్నాడంటే?

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన 'ఆయిల్ కుమార్' అనే వ్యక్తి విచిత్రమైన ఆహారపు అలవాట్లతో వార్తల్లోకి ఎక్కాడు. సాధారణ ఆహారానికి బదులు ఇంజిన్ ఆయిల్, పెట్రోల్ వంటివి తాగుతూ 33ఏళ్లుగా జీవిస్తున్నాడని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది.

New Update
Oil Kumar

సరైన ఆహారం తీసుకోకపోతే బతుకు బండి నడవదని సరదాగా అంటుంటారు. ఈ లైన్‌ను సీరియస్‌గా తీసుకున్నాడేమో ఓ వ్యక్తి. ఆయన శరీరం ఏమన్నా మోటర్ సైకిల్‌‌ అనుకున్నాడేమో.. బైక్‌లో వాడే ఇంజిన్ ఆయిల్ తాగడం అలవాటు చేసుకున్నాడు. ఈ పని అతను 33ఏళ్లు చేస్తున్నాడు అందుకే ఆయకు ఆయిల్ కుమార్ అని పేరు కూడా పడింది. 

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన 'ఆయిల్ కుమార్' అనే వ్యక్తి విచిత్రమైన ఆహారపు అలవాట్లతో వార్తల్లోకి ఎక్కాడు. సాధారణ ఆహారానికి బదులు ఇంజిన్ ఆయిల్ తాగుతూ 33ఏళ్లుగా జీవిస్తున్నాడని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఆయిల్ కుమార్ రోజూ అన్నం లేదా చపాతి వంటివి తినకుండా, 7 నుండి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్, టీ తాగుతాడట. కొందరు అతనికి ఫుడ్ ఇస్తే తీసుకోకుండా బాటిల్‌లో ఇంజిన్ ఆయిల్ తాగుతున్న వీడియోలో దృష్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అతని విచిత్రమైన ఆహారపు అలవాట్ల గురించి తెలిసిన వారు ఆశ్చర్యపోతున్నారు.

33 సంవత్సరాల నుండి ఆయిల్ కుమార్ ఇలాగే తాగుతున్నాడని.. ఇంతవరకు ఆసుపత్రిలో చేరడం లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాలేదని ఆయన చెబుతున్నారు. తాను ఆయ్యప్ప స్వామి భక్తుడిని కావడం వల్లనే ఇలా జీవించగలుగుతున్నానని ఆయిల్ కుమార్ చెబుతున్నట్లు సమాచారం.

అయితే, ఇంజిన్ ఆయిల్ తాగడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోటార్ ఆయిల్ తాగితే వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు, కిడ్నీ, లివర్ దెబ్బతినడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా, మోటార్ ఆయిల్‌లో పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్, సీసం, రాగి వంటి విషపూరిత పదార్థాలు ఉంటాయి, ఇవి క్యాన్సర్ కారకాలుగా పరిగణించబడతాయి.

ఈ విచిత్రమైన వ్యక్తి కథ నిజమా లేక కేవలం ఒక ప్రాంక్ వీడియోనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే, గతంలో కూడా ఇలాంటి విచిత్రమైన ఆహారపు అలవాట్లు ఉన్న వ్యక్తుల గురించి వార్తలు వచ్చాయి. కానీ, ఇంజిన్ ఆయిల్ వంటి విషపూరిత పదార్థాలు తాగడం చాలా ప్రమాదకరమని, అలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు