Viral Video : "నేను బట్టలు విప్పనా.. నువ్వు విప్పుతావా...' అంటూ తాళి చేతిలో పట్టుకుని....

అప్పలనాయుడు కెల్లాయ్ టీడీపీ అనే ఎక్స్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన ఓ వీడియో అందరినీ కదిలిస్తోంది.ఓ యువతి చేతిలో తాళి పట్టుకుని.. అన్నీ తీసుకున్నావ్ కదా.. తాళి కట్టడానికి ఏం అడ్డొస్తుందని అడుగుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

New Update
Viral video

Viral video

Viral Video  : ఈ మధ్య భర్తలను చంపుతున్న భార్యల కేసులు ఎక్కువగా చూస్తున్నాము కానీ, ఒక అమ్మాయి అబ్బాయిని నిజంగా ప్రేమిస్తే ప్రాణమిస్తుంది. తనే ప్రాణం అనుకున్న పురుషుడికి అన్ని సమర్పించుకుంది. కానీ కొంతమంది మగరాయుళ్లు మాత్రం ప్రేమ పేరుతో ఆడవారిని వాడుకొని వదిలేయడం పరిపాటిగా మారింది. ప్రేమిస్తున్నానని వెంటపడటం, ఆ అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, శారీరకంగా కోరికలు తీర్చుకోవడం చేస్తున్నారు. తీరా పెళ్లి అనేసరికి మొఖం చాటేస్తున్నారు. తమ ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదనో, కులం వేరే అనో, అందంగా లేదనో, ఆర్థికంగా లేదనో ఏదో ఒక కారణంతో వారిని వదిలేస్తున్నారు. అలా మోస పోయిన కొంతమంది అమ్మాయిలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొందరు మనసు చంపుకుని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇలా మోసపోతున్నవారిలో మగవారు కూడా ఉంటున్నారు. ప్రేమ పేరుతో అబ్బాయిలు తమ కామవాంఛ తీర్చుకుని వదిలించుకుంటే. మేమన్నా తక్కువ తిన్నామా అంటూ అదే ప్రేమ పేరు చెప్పి అమ్మాయిలు.. తమ అవసరాలను తీర్చుకుంటూ అబ్బాయిలను అమాంతం నాకేస్తున్నారు. ఇదంతా ఒకత్తయితే.. ప్రేమించిన వాడివి పెళ్లి చేసుకోవడానికి అడ్డెంటీ అంటూ అని అడుగుతున్న ఒక యువతి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇది కూడా చూడండి: Palnadu Ragging: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ! వీడియో వైరల్

అప్పలనాయుడు కెల్లాయ్ టీడీపీ అనే ఎక్స్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన ఓ వీడియో అందరినీ కదిలిస్తోంది.ఓ యువతి చేతిలో తాళి పట్టుకుని.. అన్నీ తీసుకున్నావ్ కదా.. తాళి కట్టడానికి ఏం అడ్డొస్తుందని అడుగుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. "మోసం చేయడం తెలియని అమ్మాయిలందరూ మోసం చేసే అబ్బాయిలకే పడతారు. అలాగే మోసం చేయడం తెలియని అబ్బాయిలకు మోసం చేసే అమ్మాయిలే దొరుకుతారు. ఇదే విధి." అని ఆ వీడియోకి ఒక లైన్ క్యాప్షన్‌గా ఇచ్చారు.

ఏ స్వార్థం లేనపుడు తాళి కట్టడానికి ఏంటి? నీలో ఏ స్వార్థం లేకుండా తోడుంటానని, నిజాయితీగా తోడుంటానని వచ్చి అన్నీ తీసుకున్నావ్ కదా. అన్ని తీసుకున్నవ్‌. ఇక మిగతా బ్యాలెన్స్‌ ఎందుకు?  తీసుకున్నావు కదా అన్ని, తీసుకున్నావా లేదా అని అడిగితే ఆ యువకుడు తల ఆడించడం ఆ వీడియోలో కనపడుతుంది. మరి ఇదేందేకు బ్యాలెన్స్‌ అంటూ ఆ యువతి ప్రశ్నించింది. తాళి కట్టు కట్టవా దేనికి కట్టవు అని ఆ యువతి ప్రశ్నించింది. అన్సర్‌ చెప్పు అంటూ గద్దించింది. అయినా ఆ యువకుడు నోరు మెదపకుండా నిశ్చబ్ధంగా చూస్తుండిపోయాడు. చివరికి " పడుకుందాం వస్తవా? నేను బట్టలు విప్పనా.. నువ్వు విప్పుతావా.. పడుకుందామా" అని ఆ అమ్మాయి అడుగుతున్న తీరు వింటుంటే మనసు చలించక తప్పదు. కాగా ఆ అమ్మాయి అతన్ని ఎంతగా ప్రేమించిందో ఆ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన వాళ్లు పాపం ఎంత నమ్మిందో అని కొందరు అంటుంటే.. పెళ్లికి ముందే అన్నీ కావాలనుకుని పడుకుందని, ఇలాంటి వాళ్లకి అలాగే జరుగుతుందని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Trump: అమెరికాలో అల్లకల్లోలం.. రాజధానిలో భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్.. అసలేం జరుగుతోంది?

Advertisment
తాజా కథనాలు