/rtv/media/media_files/2025/04/18/Vzf9mxWZ5gJvhmnR2cv2.jpg)
ఓ మహిళ నక్కతోక తొక్కింది. పెరటిలో పగిలిపోయిన పూలకుండీ లక్షలు కుమ్మరించింది. లండన్‌లో జరిగిన వేలంలో దెబ్బతిన్న పూల కుండీ రూ.56 లక్షలకు ($66,000) అమ్ముడుపోయింది. అది 4 అడుగుల ఎత్తు ఉంది. దక్షిణ లండన్‌లోని కాంబర్‌వెల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో దాని చారిత్రాత్మక గొప్పతనం వివరించారు. ఆ పూలకుండి 19వ శతాబ్దపు అవాంట్ గార్డ్ కళాఖండమని తెలిసిన తర్వాత ఈ పూలకుండికి డిమాండ్ పెరిగింది. 1939లో జర్మనీ నుండి UKకి పారిపోయిన హాన్స్ కోపర్ దాన్ని తయారు చేశాడు.
Rediscovered Hans Coper vase found in London garden among weeds and covered in snails sells three times over estimate at Chiswick Auctions:https://t.co/3MrjxWuM1dpic.twitter.com/sjwLO4r7Hr
— AntiquesTradeGazette (@ATG_Editorial) April 17, 2025
లండన్‌లోని చిస్విక్ వేలంలో మొదట ఈ పూల కుండ ధర రూ.6.7 నుండి రూ.11 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఆ పూలకుండి దక్కించుకోడానికి ఆసక్తి చూపారు. అమెరికాకు చెందిన వ్యక్తి రూ.56 లక్షలు వేలం పాడి పురాతన వస్తువును సొంతం చేసుకున్నాడు. కుండిని రిపేర్ చేయడానికి రూ.9 లక్షలు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రాతి పాత్రను కోపర్ 1964లో తయారు చేశారు.