Alekhya Chitti Pickles: పక్కా ప్లాన్‌తో మళ్లీ వస్తున్నాం.. మా కొత్త బిజినెస్ పేరు ఇదే.. అలేఖ్య చిట్టి సంచలన వీడియో!

పక్కా ప్లాన్‌తో ఈసారి స్ట్రాంగ్‌గా వస్తున్నాం అని అలేఖ్య చిట్టి సిస్టర్ రమ్య వీడియో రిలీజ్ చేసింది. అలేఖ్య చిట్టి పికిల్స్ కాకుండా రమ్యమోక్ష పికిల్స్ పేరుతో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. నేనొక్కదాన్నే హ్యాండిల్ చేస్తున్నా అంటూ తెలిపింది.

New Update
alekhya chitti sister Ramya gopal kancharla next business video

alekhya chitti sister Ramya gopal kancharla next business video


అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం ఎంతటి హాట్ టాపిక్‌ అయిందో అందరికీ తెలిసిందే. పచ్చళ్ల ధర ఎక్కువగా ఉందని అడిగినందుకు బూతులతో రెచ్చిపోయిన అలేఖ్య చివరికి  హాస్పిటల్ పాలైంది. ట్రోలర్స్, మీమర్స్ దెబ్బకు ఐసీయూలో చేరింది. ప్రస్తుతం వీరి వ్యవహారం సర్దుమనిగింది. ఈ క్రమంలో అలేఖ్య చిట్టి సిస్టర్ రమ్య గోపాల్ కంచర్ల సంచలన వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. 

నెక్స్ట్ బిజినెస్ అదే

అందులో తమ నెక్స్ట్ బిజినెస్, కస్టమర్స్ సహా మరెన్నో విషయాల గురించి పంచుకుంది. ‘‘మా పచ్చళ్ల బిజినెస్ పెట్టి 11 నెలలు బాగా నడిచింది. కానీ ఈ కాంట్రవర్సీ వల్ల ఇంత తక్కువ సమయంలోనే మూసేస్తామని అస్సలు అనుకోలేదు. ఆ బిజినెస్ అయితే అఫీషియ్‌గా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అనే డైలమాలో మేమంతా ఉన్నాం. అలేఖ్య చిట్టి పికిల్స్ పేరును రమ్య మోక్ష పికిల్స్ పేరుతో కంబ్యాక్ ఇద్దామని అనుకుంటున్నాం.

కానీ గతంలో కంటే ఇప్పుడు సపోర్ట్ ఉంటుందా లేదా అనేది తెలియడం లేదు. మమ్మల్ని కంబ్యాక్ ఇవ్వమని పాత కస్టమర్లు రిక్వస్ట్ చేస్తున్నారు. ఈసారి పెట్టబోయే రమ్య మోక్ష పికిల్స్ అందరికీ అందుబాటు ధరలలో తీసుకొస్తాం. ధరకు తగ్గ క్వాలిటీ కూడా అందిస్తాం. అలాగే కస్టమర్లతో మాట్లాడేందుకు ఒక వర్కర్‌ను పెట్టుకుందామని అనుకుంటున్నాం. ఇందులో మా సిస్టర్ అలేఖ్యను ఇన్వాల్వ్ చేయను. మొత్తం నేనే చూసుకుంటా.

త్వరలో రమ్యమోక్ష పికిల్స్‌తో మీ ముందుకు రాబోతున్నాం. దాదాపు 2 నెలలు పట్టొచ్చు. కానీ ఈ సారి అయితే స్ట్రాంగ్‌గా వస్తున్నాం. ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా అయితే ఆదరించి సపోర్ట్ చేశారో.. ఇకపై కూడా అదే విధంగా ఆదరిస్తారని అనుకుంటున్నాను.’’ అంటూ చెప్పుకొచ్చింది.   

alekhyaa chitti pickle | Alekhya Chitti Pickles | latest-telugu-news | telugu-news | Ramya gopal kancharla 

Advertisment
Advertisment
తాజా కథనాలు