Biryani: పిల్లలూ ఎంజాయ్, పండగో.. అంగన్‌వాడీ మెనూలో బిర్యానీ

కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ ప్రకటించిన అంగన్‌వాడీ కొత్త మెనూలో ఎగ్ బిర్యానీ, పులావ్ వంటి టేస్టీ వంటకాలు ఉన్నాయి. ఓ పిల్లాడు ఉప్మాకు బదులుగా బిర్యానీ కావాలని కోరిన వీడియో వైరల్ అయ్యింది. అది ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.

New Update
_Kerala Anganwadi Menu

అంగన్‌వాడీ సెంటర్‌లో నాకు ఉప్మా బదులుగా బిర్యానీ తినాలని ఉందని ఓ చిన్నారి కోరిక 3 నెలల క్రితం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. అది కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ దృష్టిని వెళ్లింది. దీంతో ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని అంగన్‌వాడీ సెంటర్ కొత్తగా వచ్చిన మెనూలో బిర్యానీ యాడ్ చేశారు. మంగళవారం ప్రకటించిన మెనూలో ఎగ్ బిర్యానీ, పులావ్, పప్పు పాయసం, సోయా డ్రై కర్రీ, న్యూట్రి లడ్డులు వంటి టేస్టీ వంటకాలు ఉన్నాయి. అంగన్‌వాడీ సెంటర్‌లో వేలాది మంది పిల్లలకు మెరుగైన పోషక ఆహారం అందుతోంది.

అంగన్‌వాడీ పిల్లల కోసం సవరించిన మెనూను మంత్రి జార్జ్ ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పిల్లల సంరక్షణ కేంద్రాలకు ఏకీకృత మెనూ అమలు చేయడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు.  ఫిబ్రవరిలో అలప్పుజకు చెందిన శంకు అనే పిల్లాడు అంగన్‌వాడీలో ఉప్మాకు బదులుగా బిర్యానీ, చికెన్ ఫ్రైని పెట్టాలని కోరుతూ వీడియో చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జార్జ్ మెనూను సవరిస్తానని హామీ ఇచ్చాడు. పిల్లలకు కోజుకట్ట, ఇలయడ వంటి సాంప్రదాయ స్నాక్స్‌తో పాటు గోధుమ ముక్క పులావ్, రైతా, శనగ కూర వంటి పోషకాలతో కూడిన వంటకాలున్నాయి. గతంలో వారానికి 2సార్లు అందించే పాలు, గుడ్లు ఇప్పుడు వారానికి 3 సార్లు అందించబడతాయని ఆమె తెలిపారు.

biryani | Kerala Anganwadi Menu | kerala | anganwadi | anganwadi-center | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు