Baby Boy: బాల గణేష్ పుట్టాడు.. పుట్టుకతోనే 5.2 కేజీలున్న బాలుడు

సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలు 2.5 నుంచి 3.5 కిలోల బరువు ఉంటారు. కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళ ఏకంగా 5.2 కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చింది. వినాయక చవితి నవరాత్రుల్లో పిల్లాడు పుట్టడంతో ఆ కుటుంబం సంతోషానికి అవదులు లేవు.

New Update
bala ganesh

సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలు 2.5 నుంచి 3.5 కిలోల బరువు ఉంటారు. కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళ ఏకంగా 5.2 కిలోల బరువున్న మగ శిశువు(5.2kg Baby Boy) కు జన్మనిచ్చింది. తల్లి, పిల్లాడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. వినాయక చవితి నవరాత్రుల్లో పిల్లాడు పుట్టడంతో ఆ కుటుంబం సంతోషానికి అవదులు లేవు. దీంతో స్వయంగా బాల గణేషే మా ఇంట్లో పుట్టాడని ఆ కుటుంబ సభ్యులు సంతోషపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఈ అరుదైన, ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంత బరువున్న శిశువు జన్మించడం చూసి వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.

5.2 kg Baby Boy Born

ప్రసవానికి వచ్చిన మహిళకు సిజేరియన్ చేసి వైద్యులు డెలివరీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, "సాధారణ బరువు కంటే రెట్టింపు బరువుతో శిశువు జన్మించడం చాలా అరుదు. తల్లికి గర్భధారణ సమయంలో మధుమేహం లేదా ఇతర సమస్యలు ఉంటే ఇలా జరగవచ్చు. కానీ ఈ కేసులో తల్లి ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉంది. మేము తల్లి, శిశువు ఇద్దరికీ పూర్తి పరీక్షలు నిర్వహించాం. ఇద్దరూ క్షేమంగా ఉన్నారు" అని తెలిపారు.

కుటుంబ సభ్యులు బాలుడి పుట్టుకను ఓ అద్భుతంగా భావిస్తున్నారు. శిశువు కుటుంబంలోకి అడుగుపెట్టిన రోజే వినాయక చవితి పండుగ(Vinayaka Chavithi Festival 2025) కూడా వచ్చింది. దీంతో శిశువు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ పసికందును "బాల గణేశుడు"గా అభివర్ణించారు. "సాక్షాత్తు మా ఇంట్లో గణనాథుడే జన్మించాడు" అని వారు సంతోషం వ్యక్తం చేశారు. శిశువు ఆరోగ్యంగా ఉండటం, గణేశ చవితి రోజునే జన్మించడం వారికి రెట్టింపు సంతోషాన్ని కలిగించింది.

అయితే, అధిక బరువు గల శిశువుకు భవిష్యత్తులో ఊబకాయం లేదా మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. అందువల్ల తల్లిదండ్రులు శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ అసాధారణ జననం ప్రస్తుతం జబల్‌పూర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు