Aghori: లేడీ అఘోరీగా తిరుగుతున్న శ్రీనివాస్, వర్షిణిలు ఎట్టకేలకు అనుకున్నంత పనిచేశారు. సోమవారం ఓ గుడిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. వేదమంత్రాల సాక్షిగా వర్షిణి మెడలో తాళి కట్టింది అఘోరీ. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
సాధువుల మధ్య అంగరంగ వైభవంగా..
ఈ మేరకు నార్త్ స్టేట్‌లో అనేక సాధువుల మధ్య అంగరంగ వైభవంగా అఘోరీ-.. వర్షిణి మెడలో తాళి కట్టింది. ఇద్దరు పరస్పరం దండలు మార్చుకుని తలంబ్రాలు పోసుకున్నారు. హోమ గుండం చుట్టూ ఏడు అడుగులు నడిచారు. అక్కడున్న సాధువులంతా భక్తి పాటలు పాడుతూ నూతన జంటను ఆనంద పరిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన అఘోరీ.. ఇద్దరం కలిసి మరోసారి పార్వతి పరమేస్వర్లకు జన్మిస్తామని చెప్పింది. శ్రీ వర్షిణీతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న తన ఇంటికి వస్తానని చెప్పింది. తామిద్దరం పిల్లలను కూడా కంటామంటూ చెప్పడం విశేషం. తల్లిదండ్రుల సమక్షంలో ఒకసారి, అంతకముందు దేవాలయంలో ఒక సారి మొత్తం రెండు సార్లు వర్షిణికి తాళి కట్టినట్లు అఘోరి చెప్పింది.
Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్
ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూజల పేరిట భారీ మోసాలకు పాల్పడ్డట్లు సైబరాబాద్ మొకిలా పీఎస్‌లో కేసు నమోదైంది. యోని పూజ చేస్తానంటూ రూ.10 లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ మహిళా నిర్మాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఉజ్జయినిలోని ఫాంహౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. రెండు విడతలుగా అఘోరీకి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు తెలిపింది. దీంతో ఫిబ్రవరి 25న అఘోరీపై 308(5), 318(1),351(4),352 BNS సెక్షన్లకింద ఎఫ్ఐఆర్ నమోదైంది.
Also Read: మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..
Aghori for Varshini | telugu-news | today telugu news