Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

ఇన్‌స్టాగ్రామ్‌లో లవ్ చేసిన అబ్బాయి కోసం ఓ యువతి అమెరికా నుంచి ఇండియాకు వచ్చేసింది. జాక్లిన్ ఫోరెరో అనే అమెరికా యువతికి ఆన్‌లైన్‌ ఆంధ్ర ప్రదేశ్ మారుమూల గ్రామానికి చెందిన చందన్ పరిచయం అయ్యాడు. 14నెలల ఆన్‌లైన్ డేటింగ్ తర్వాత వారు పెళ్లి చేసుకోబోతున్నారు.

New Update
us girl insta love

us girl insta love Photograph: (us girl insta love)

అబ్బాయిదేమో ఆంధ్రప్రదేశ్, అమ్మాయిదేమో అమెరికా. వీళ్ల ఇద్దర మధ్య వేల మైళ్ల కిలో మీటర్ల దూరం ఉంది. అయినా సరే ప్రేమ వీళ్లని కలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక హాయ్ నుంచి మొదలైన వీరి పరిచయం ప్రేమ, పెళ్లి దాకా వచ్చింది. చందన్ అనే యువకుడిది ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కడో మారుమూల గ్రామం. జాక్లిన్ ఫోరెరో అనే యువతి అమెరికాకు చెందిన ఫోటోగ్రాఫర్. ఇన్‌స్టాగ్రామ్‌లో వీళ్లు ఒకరికోకరు పరిచయం అయ్యారు.  చందన్‌ను పెళ్లి చేసుకోడాని జాక్లిన్ ఫోరెరో ఇటీవల ఇండియా వచ్చేసింది. ఆన్‌లైన్ ప్రేమ కోసం అయిన వాళ్లను సైతం వదులుకోని ఖండాలు దాటి వచ్చింది. అందుకే అంటారు ప్రేమ గుడ్డిదని.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

14నెలలు వీళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఇరువురు కుటుంబాల అంగీకారంతో ఒక్కటవ్వాలనుకుంటున్నారు. వీరిద్దరూ ప్రేమలో పడటానికి కారణం. వారి ఇద్దరి అభిరుచులు దగ్గరగా ఉండటం. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే మొదట చందన్‌కు ఆమె మెస్సేజ్ చేసిందట. ఆమె అతని కంటే తొమ్మిది సంవత్సరాలు పెద్దది. ఫోటోగ్రాఫీ, మ్యూజిక్ వారికి చాలా ఇష్టం. ఇండియా వచ్చిన యువతితో చందన్ ఆంధ్రా అందాలు అన్నీ చూపిస్తున్నాడు. వీళ్లిద్ధరూ కలిసి చక్కగా వీడియోలు చేసుకుంటూ తిరుగుతున్నారు. తర్వలోనే క్రైస్తవ మత ఆచారాల ప్రకారం వీళ్ల పెళ్లి జరగనుంది.

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
తాజా కథనాలు