Viral Video : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. రామాలయంలో రాంలల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్టను వైభవంగా నిర్వహించారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన మరునాడే వాస్తవాధీనరేఖ వద్ద భారత ఆర్మీ జవాన్లతో కలిసి చైనా సైనికులు(Chinese soldiers) జై శ్రీరామ్(jai sriram) అంటూ నినాదాలు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో గురించి తేదీ మాత్రం ఖచ్చితంగాతెలియరాలేదు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సిబ్బందికి జై శ్రీరామ్ నినాదాలు చేయడంలో భారతీయ సైనికులు సహాయం చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. రెండువైపులా టేబుల్స్ వేసుకుని ఉన్నాయి.
స్నాక్స్ తోపాటు డ్రింక్స్ ఉన్నట్లు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. భారత్, చైనాల మధ్య లడక్ లో దీర్ఘకాలంగా సరిహద్దులో ఉద్రికత్తలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు దేశాలకు చెందిన సైనికులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా మారింది. అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత రోజు ఈ బయటకు రావడం గమనార్హం. అసలు ఈ వీడియో నిజమా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ వీడియో కనీసం మూడు నెలల క్రితం తీసిందన్న అభిప్రాయం కూడా లేకపోలేదు.
ఇది కూడా చదవండి: రైతులకు అదిరిపోయే వార్త..మధ్యంతర బడ్జెట్ 2024లో కేంద్రం కీలక నిర్ణయం..!!