/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-15T201715.319.jpg)
Flight Services : కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) ఏపీ ప్రజలకు శుభవార్త తెలిపారు. విజయవాడ (Vijayawada) నుంచి ఢిల్లీ (Delhi) కి ప్రతిరోజూ ఇండిగో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి ఈ విమాన సేవలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దీనివల్ల అమరావతి, ఢిల్లీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: సమస్యల స్వీకరణకు ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించిన దగ్గుబాటి పురందేశ్వరి.!
విమాన సమయం వేళలు
విజయవాడ నుంచి విమానం 11.10 PM గంటలకు బయలుదేరి.. ఢిల్లీకి 1.10 AM గంటలకు చేరుకుంటుంది. అలాగే ఢిల్లీ నుంచి 8.10 AM గంటలకు బయలుదేరి.. విజయవాడకు 10.40 AM గంటలకు చేరుకుంటుంది. విమాన ప్రయాణ సమయం మొత్తం 2 గంటల 30 నిమిషాల పాటు ఉంటుంది.
Excited to announce a new daily flight service by @IndiGo6E connecting Vijayawada to Delhi, starting from September 14th, 2024.
Vijayawada to Delhi: Departure 1110hrs, Arrival 1340hrs
Delhi to Vijayawada: Departure 0810hrs, Arrival 1040hrs
This new connection will further…
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) August 15, 2024