AP: సమస్యల స్వీకరణకు ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించిన దగ్గుబాటి పురందేశ్వరి.! విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజల సమస్యల స్వీకరణ కోసం రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్ ను ఆమె ప్రారంభించారు. By Jyoshna Sappogula 15 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి BJP Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం మాట్లాడుతూ... దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందు తరం వాళ్లు ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్య్రం తెచ్చారన్నారు. ఆ ఐకమత్యాన్ని పరి రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. Also Read: బెట్టింగ్ కు బానిసై రూ.2 కోట్లు అప్పు చేసిన కొడుకు.. ప్రాణాలు తీసుకున్న పేరెంట్స్! కొన్ని దేశాల కుట్రల నేపథ్యంలో భారతీయులంతా ఒకటనే భావనతో ఉండాలన్నారు. 2040 నాటికి వికసిత భారత్ చూడాలనేది ప్రధాని మోదీ లక్ష్యమని తెలిపారు. వికసిత ఏపీ కోసం మనం అంతా కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అంకితమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏపీ 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి తిరుగులేని అధికారం ఇచ్చారన్నారు. Also Read: కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. కోర్టులో పిటిషన్! ప్రజల సమస్యలు పరిష్కారానికి బీజేపీ వారధి కార్యక్రమం ప్రారంభించిందని తెలిపారు. నేటి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజల సమస్యల స్వీకరణకు ఏపీ ప్రత్యేక వెబ్ సైట్‌ను ప్రారంభించారు. ప్రజల సమస్యలు పరిష్కరించి వాటిని ఒక యాప్‌లో పెడతామని. ప్రజలకు సేవకులుగా పని చేసి.. వారి కన్నీరు తుడుస్తామని పురందేశ్వరి పేర్కొన్నారు. #bjp-purandeswari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి