Vijay Sethupathi : 'ఉప్పెన' సినిమాకి చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నా.. దానికి కారణం ఆయనే : విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి త్వరలోనే ‘మహారాజా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో 'ఉప్పెన' మూవీపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ బచ్చిబాబు వల్లే సినిమా ఒప్పుకున్నానని అన్నాడు.

New Update
Vijay Sethupathi

Vijay Sethupathi Interesting Comments On Uppena Movie : కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరో త్వరలోనే ‘మహారాజా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి 'ఉప్పెన' మూవీపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా డైరెక్టర్ బచ్చిబాబు వల్లే సినిమా ఒప్పుకున్నానని అన్నాడు.

బుచ్చిబాబు కోసమే...

తాజా ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. " ఉప్పెన (Uppena) సినిమా కేవలం నేను బుచ్చిబాబు కోసమే చేశా. ఆయనకున్న ప్యాషన్‌ చూసి నేను ఒప్పుకున్నా. చాలా తక్కువ రెమ్యునరేషన్‌కే ఉప్పెన సినిమా చేశా. మామూలుగా ‍అయితే నాలాంటి యాక్టర్స్‌ చేయడానికి వెనుకాడతారు. కానీ సినిమా పట్ల బుచ్చిబాబుకున్న ప్యాషన్ చూసే ఆ సినిమాలో నటించా" అని చెప్పుకొచ్చాడు.

Also Read : ‘కల్కి’ కి అరుదైన గౌరవం.. అక్కడ ఒకరోజు ముందే రిలీజ్ అవుతున్న రెండో సినిమాగా!

దీంతో విజయ్ సేతుపతి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మహారాజా (Maharaja) సినిమా విషయానికొస్తే.. క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్‌ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటూ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు