/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/vijay-1-jpg.webp)
Rashmika-Vijay Devarakonda : టాలీవుడ్(Tollywood) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఒకరు. ఆయన తన సోషల్ మీడియా(Social Media) ఖాతాలో ఏదైనా ఫోటో షేర్ చేస్తే దాని కింద కామెంట్లు మొత్తం ఆయన పెళ్లి గురించిన చర్చలే జరుగుతాయి. దానికి తగినట్లుగానే విజయ్ దేవరకొండ , నటి రష్మిక(Rashmika) ప్రేమలో ఉన్నారని, చాలా కాలం నుంచి వీరిద్దరూ రహస్యంగా ఈ మేటర్ ని ఉంచుతున్నారంటూ చాలా రుమార్స్ షికార్లు చేస్తున్నాయి.
అంతేకాకుండా ఒక సందర్భంలో వీరిద్దరూ ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్న ఫోటోలను వేరువేరుగా పోస్ట్ చేయడం , బ్యాగ్రౌండ్ ఒకటే ఉండడంతో వాటిని చూసిన అభిమానులు విజయ్‌ను అన్నను చేసి..రష్మికను వదినమ్మను చేశారు. వీరిద్దరూ కలిసి మంచి సినిమాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
ప్రతి రెండు సంవత్సరాలకు ఓ సారి నాకు పెళ్లి..
ఇక కొద్ది రోజుల నుంచి అయితే విజయ్ కి రష్మిక కి ఏకంగా ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్(Engagement) నే చేసేస్తున్నారు. తాజాగా ఈ విషయం గురించి విజయ్ దేవరకొండ స్పందించారు. '' మీడియా వారు ప్రతి రెండు సంవత్సరాలకు ఓ సారి నాకు పెళ్లి చేసేస్తున్నారు. ఈ సారి పెళ్లి చేసేటప్పుడు నాకు కూడా చెప్పండి. చాలా మంది నా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నట్లు ఉన్నారు. అందుకే ఈ ఫిబ్రవరిలో నాకు ఎంగేజ్‌మెంట్ చేస్తున్నారు.
In an exclusive interview, Vijay Deverakonda (@thedeverakonda) cleared the air about all the rumours suggesting he’s about to get hitched to his rumoured girlfriend, Rashmika Mandanna. “I’m not getting engaged or married in February. It feels like the press just wants to get me… pic.twitter.com/fyVuPZBMcX
— Suresh PRO (@SureshPRO_) January 19, 2024
కానీ వాటిలో ఏ మాత్రం నిజం లేదు..అంటూ చెప్పుకొచ్చాడు. ఇటు విజయ్, అటు రష్మిక ఇద్దరు కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. విజయ్ తో గీతాగోవిందం వంటి సూపర్ హిట్ ను అందుకున్న పరుశురామ్ ఈ చిత్రానికి డైరెక్టర్.
అసలు ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వేసవి విందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరితో విజయ్ వీడీ13 ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నాడు. ఇక రష్మిక అయితే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. రీసెంట్ గా యానిమల్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.
Also read: దుగ్గిరాల పసుపు కోల్డ్ స్టోరేజీలో భారీ అగ్ని ప్రమాదం..కోట్లలో ఆస్తి నష్టం!