/rtv/media/media_files/2025/09/30/condom-2025-09-30-16-47-44.jpg)
Condom Safety Tips: లైంగికపరమైన జాగ్రత్తల విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఇందులో ముఖ్యమైనది కండోమ్ వాడకం. మారుతున్న కాలానుగుణంగా వన్ నైట్ స్టాండ్, లివింగ్ రిలేషన్ కల్చర్ కూడా పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే కొంతమంది విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంటున్నారు. తమ కోరికలు తీర్చుకోవాలనే ఆరాటంలో జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోతున్నారు. మరికొంతమంది కండోమ్ వాడితే కిక్కు ఉండదనే సాకుతో సుఖవ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇటీవల వైద్యులు నిర్వహించిన సర్వేలో.. అనుకోకుండా కొన్న జంటలు గడువు ముగిసిన కండోమ్‌లు వాడుతున్నట్లు బయటపడింది.
ఆ క్షణం నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం..
ఈ మేరకు సెక్సాలజిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్ యెన్సర్ డాక్టర్ కట్రస్.. రతికి సంబంధించిన జాగ్రత్తలపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'సంభోగం సమయంలో జాగ్రత్తలు చాలా కీలకమైనవి. గడువు ముగిసిన కండోమ్‌లను ఉపయోగించడం వల్ల అనేక రకాల వ్యాధులబారిన పడతారు. చాలామంది కండోమ్ గడువు తేదీలను చెక్ చేయకుండానే వాడేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకంర. ఎప్పుడైనా సరే కండోమ్ ప్యాకేట్ కొన్నవెంటనే దానిపై ముద్రించిన గడువు తేదీని చూడాలి. ఒకవేళ చూడకుండా వాడితే గర్భధారణ ప్రమాదంతోపాటు, లైంగిక వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, చర్మవ్యాధులు, అలెర్జీలతో సహా తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. దీనివల్ల ఎయిడ్స్ సోకే అవకాశం ఎక్కువ. చిన్న నిర్లక్ష్యం వల్ల పెళ్లికాని వారు జీవితాలను నాశనం చేసుకుంటే.. పెళ్లైన వారు తమ కుటుంబాలను నాశనం చేసుకున్నవారవుతారు' అంటూ హెచ్చరించారు.
ఏ విషయాలను గుర్తుంచుకోవాలి?
- ప్యాకేజీ చిరిగిపోయినా లేదా చిన్నగా దెబ్బతిన్నా ఉపయోగించవద్దు.
- సింగిల్ యూజ్ కండోమ్‌లను మళ్లీ వాడకూడదు.
- గడువు ముగిసేలోపు వాడాలి. లేదంటే చెత్తబుట్టలో పడేయాలి.
- అపరిచితులతో రతిలో పాల్గొనేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి.
- ముఖ్యంగా మద్యం మత్తులో సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళ్లకపోవడం మంచిది.
- కామావాంఛ అతిగా ఉన్నప్పుడు డాక్టర్లు, నిపుణులను సంప్రదించాలి.
- నాసిరకం కండోమ్ కొన్నిసార్లు సంభోగంలో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఇది కూడా చూడండి: విజయ్ ఇంటి ముందు భారీ భద్రత.. ఏ క్షణమైనా ఉద్రిక్తత!
గడువు ముగిసిన కండోమ్ ఉపయోగిస్తే ఏం చేయాలి:
- మీరు అనుకోకుండా గడువు ముగిసిన కండోమ్‌ను ఉపయోగిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి .
- మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా చికాకు అనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి.
- ఎల్లప్పుడూ కొత్తవి, నాణ్యమైన కండోమ్ మాత్రమే వాడాలని గుర్తించుకోండి.
- డాక్లర్ల వద్ద ఈ విషయంలో మొహమాటం లేకుండా చెప్పేయండి.
కండోమ్ భద్రత, నిల్వ చిట్కాలు:
- కండోమ్‌లను చలి, వేడికి దూరంగా.. సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచాలి.
- కండోమ్‌ను ఎక్కువసేపు వాలెట్‌లో ఉంచడం వల్ల బలహీనంగా తయారవుతుంది.
- అవసరమైనప్పుడు తప్పకుండా ప్యాక్‌ని పరిశీలించి వాడండి.
ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు ముగిసిన కండోమ్‌లను ఉపయోగించడం సురక్షితం కాదు. ఇది తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ కొత్త, ఉపయోగించని, సరిగ్గా తేదీ ఉన్న కండోమ్‌లను వాడాలి. సురక్షితమైన శృంగారానికి మాత్రమే ప్రధాన్యత ఇవ్వండి. లేదంటే ఆవేశంలో ఏ చిన్న పొరపాటు చేసినా అది జీవితాన్ని నాశనం చేస్తోంది. క్షణికావేశం మిమ్మల్ని జీవితాంతం వేధిస్తుందని గుర్తుంచుకోండి.