లాభాలతో మొదలై నష్టాలు.. ఈ రోజు స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయంటే?

గత ఐదు రోజుల నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పడుతున్నాయి. ఈరోజు లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ డిమాండ్ రోజురోజుకు తగ్గడంతో షేర్లు తగ్గుతూనే ఉన్నాయి.

Stock Markets
New Update

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ఐదు రోజుల నుంచి స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. కానీ ఈ రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ఇలా సంతోష పడటమే ఆలస్యం.. మళ్లీ నష్టాల బాట పడుతున్నాయి. లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 69.50 పాయింట్లు పెరిగి, సెన్సెక్స్ 238.83 పాయింట్ వద్ద 81,927.29 దగ్గర ఆగింది. సెన్సెక్స్ అలా క్రమంగా 400 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 150 పాయింట్లు తగ్గింది.

ఇది కూడా చూడండి: రతన్ టాటాకు సీరియస్.. క్లారిటీ!

నష్టాల్లోనే ఎక్కువ షేర్లు..

బ్యాంకుల నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్‌లు కూడా 100 సూచీలు వరుసగా 320, 1537 పాయింట్లు నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, భారతి ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, సిప్లా, ఐటీసీ సంస్థలు ప్రస్తుతం లాభాల్లో ఉండగా.. అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, అదానీ ఎంటర్‌ప్రైజస్ కంపెనీల స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీలో కేవలం 43 షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. మిగతా షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

ఇది కూడా చూడండి: దుర్గామాతపై స్వయంగా పాట రాసిన మోదీ.. వైరల్ అవుతోన్న వీడియో!

ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు కూడా పతనం దిశగా ఉన్నాయి. అలాగే ప్రముఖ కంపెనీ టాటా షేర్లు కూడా పతనమవుతున్నాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ డిమాండ్ రోజురోజుకు తగ్గడంతో ఈ సంస్థ షేర్లు కూడా పడిపోతున్నాయి. ఈ కంపెనీ స్టాక్స్ గత రెండు నెలల నుంచి కుప్పకూలుతున్నాయి. 

ఇది కూడా చూడండి: Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు యూ-టర్న్

#sensex #nifty #stock-markets-today
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe