/rtv/media/media_files/O7SHARQVtretqFmLQNLl.jpg)
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. బీపీ పడిపోవడంతో అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్‌లో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రతన్ టాటా సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించారు. తనకి ఏదో జరిగిందని ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వయస్సు పెరగడం కారణంగా కొన్ని టెస్ట్‌లు చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లినట్లు రతన్ టాటా తెలిపారు.
Ratan Tata
Thank you for thinking of me 🤍 pic.twitter.com/MICi6zVH99
— Ratan N. Tata (@RNTata2000) October 7, 2024
Also Read : టీడీపీలో చేరబోతున్నాం.. చంద్రబాబును కలిసిన తర్వాత BRS నేతల సంచలన ప్రకటన!