Supreme Court: నోట్ల కంటే ఓట్లకే శక్తి ఎక్కువ.. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ హర్షం

రాజకీయ పార్టీలకు విరాళంగా వచ్చే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమైనవని.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్‌ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఎన్నికల బాండ్లను మోదీ ప్రభుత్వం కమీషన్లుగా మార్చేసిందని.. ఇది కోర్టులో రుజువైందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

AP Congress: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. అభ్యర్థుల మార్పు!
New Update

రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు అనేవి రాజ్యాంగ విరుద్ధమంటూ తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  స్పందించారు. ఎన్నికల బాండ్లను మోదీ ప్రభుత్వం కమీషన్లుగా మార్చేసిందని.. ఇది కోర్టులో రుజువైందంటూ విమర్శించారు.

Also Read: టాబ్లెట్‌ వేసుకొని శృంగారంలో రెచ్చిపోయాడు.. చివరికి

నోట్ల కంటే ఓట్లకే శక్తి ఎక్కువ

మోదీ తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం.. పార్లమెంట్‌ ఆమోదించిన రెండు చట్టాలను అలాగే రాజ్యాంగ విలువల్ని ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు చెప్పినట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్‌ (ట్విటర్‌)’లో పేర్కొన్నారు. నోట్ల కంటే ప్రజల ఓట్లకే శక్తి ఎక్కువ అనే నిజాన్ని సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు బలపర్చిందని అన్నారు. దీన్ని మేము స్వాగతిస్తున్నామని తెలిపారు. చందాలిచ్చే దాతలకు ప్రత్యేక అధికారాలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రైతులకు ప్రతీసారి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. వీవీప్యాట్ల సమస్యలపై రాజకీయ పార్టీలతో సమావేశమయ్యేందుకు ఎన్నికల సంఘం పదే పదే నిరాకరిస్తోందని దుయ్యబట్టారు. ఈ అంశాన్ని సైతం సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇది రాజ్యాంగ ఉల్లంఘన

దేశంలో ఓటింగ్ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుంటే.. రాజకీయ పార్టీలతో సమావేశమయ్యే విషయంలో మాత్రం ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని ఆయన ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించారు. ఇదిలాఉండగా.. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్రానికి షాక్ ఇచ్చినట్లైంది. ఎన్నికల బాండ్ల పథకం అనేది.. సమాచార హక్కు, ఆదాయపు పన్ను చట్టాలను ఉల్లంఘిస్తోందని తన తీర్పులో చెప్పింది. వివిధ వ్యక్తుల నుంచి సేకరించే ఈ విరాళాలు క్విడ్ ప్రోకోకు దారితీయొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని.. ఎన్నికల బాండ్ల జారీని తక్షణమే ఎస్‌బీఐ నిలివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read: మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ కూడా చర్చించాల్సిందే- రైతు సంఘాలు డిమాండ్

#telugu-news #congress #national-news #bjp #supreme-court #electoral-bonds
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe