వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ సినీ సెలెబ్రిస్ పై వివాదాస్పద జాతకాలు చెప్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ఈయన. ఇక సోషల్ మీడియాలో ఈయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
నార్మల్ జనం నుండి మొదలు పెడితే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వరకు ఈయన్ని నమ్మే వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే చాల మంది సినీ హీరోయిన్స్ ఆయన దగ్గర కొన్ని పూజలు కూడా చేశారు. రీసెంట్ టైమ్స్ లో ఈయనపై ట్రోలింగ్ తో పాటూ కేసులు కూడా ఎక్కువయ్యాయి. దాంతో కొద్దీ రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. ఇక తాజాగా మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
నన్ను గెలికారు అందుకే సినిమా ఇండస్ట్రీ పతనం మొదలు అయ్యింది!
— మీ కాపలా కుక్క (@mekaapalaKukka) December 18, 2024
-- వేణు స్వామి
😳😳😳😳😳😳😳 pic.twitter.com/D6BZO8fQyI
నేను అప్పుడే చెప్పా..
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తనను గెలికినందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ గతి పట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.' తెలుగు సినిమా ఇండస్ట్రీ గింగిరాలు తిరుగుతుందని నేను ఓ ఇంటర్వ్యూలో చెప్పా. ఒక పెద్ద హీరోకి సంబంధించి కన్వెన్షన్ ను కూల గొట్టడం, భారత దేశానికి పేరు తెచ్చిన డైరెక్టర్ ను టార్చర్ పెట్టడం, ఒక పాన్ ఇండియా హీరోని ఒకరోజు జైల్లో పెట్టడం, మోహన్ బాబు ఇంట్లో గొడవలు..
ఇలా నాలుగు పెద్ద ఇన్సిడెంట్లు ఈ ఏడాది ఇండస్ట్రీలో జరిగాయి. గతంలో ఇన్ని సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ జరుగుతాయని నేను ముందే చెప్పా. ఇంకా చాలా జరుగుతాయి..' అని అన్నాడు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read: కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి.. సూసైడ్ చేసుకున్న సింగర్ శృతి కన్నీటి కథ!