Venky-Nani Multi-Starrer: త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకీ, నాని మల్టీస్టారర్ మూవీ!! Venky-Nani Multi-Starrer:విక్టరీ వెంకటేష్ ,నాచురల్ స్టార్ నాని కాంబోలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం. . By Nedunuri Srinivas 03 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి VENKATESH - NANI :ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు రప్పించడంలో సిద్దహస్తులు విక్టరీ వెంకటేష్ , నేచురల్ స్టార్ నాని. వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్ మూవీ వస్తీ ఎలా ఉంటుంది.? ఇక.. అటు ఫ్యాన్స్ కు ,ఇటు కుటుంబ ప్రేక్షకులకు పండగే పండగ.అందుకే గురూజీ త్రివిక్రమ్ ఏం ఆలోచించినా తన పంచ్ డైలాగ్స్ లానే సాలిడ్ గా ఉంటాయి.అయితే.. ప్రస్తుతం త్రివిక్రమ్ గుంటూరు కారం ఫినిష్ చేసిన సంగతి తెలిసిందే. మరి..నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? బన్నీ - త్రివిక్రమ్ కాంబో టైం పడుతుంది నిజానికి గుంటూరు కారం ఫినిష్ అయిన వెంటనే బన్నీ తో మూవీ చెయ్యాలి. అయితే పుష్ప 2 మూవీ లో బన్నీ బిజీగా ఉండటం మూలాన ఈ కాంబినేషన్ ట్రాక్ ఎక్కేసరికి టైమ్ పట్టొచ్చు.ఈ చిత్రాన్నిహారిక హాసిని సంస్థ ఇదివరకే అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. బన్నీ బిజీ షెడ్యూల్ కారణంగా త్రివిక్రమ్ కూడా తన ప్లాన్ బి ని సిద్దం చేసుకున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ పెన్ పవర్ ఎంటో బాక్స్ ఆఫీస్ వద్ద చూపించారు ఇక..విక్టరీ వెంకటేష్ తో త్రివిక్రమ్ ఎన్నాళ్ళ నుంచో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ చెయ్యాలని అనుకుంటున్నారు.గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు రచన అందించిన త్రివిక్రమ్ తన పెన్ పవర్ ఎంటో బాక్స్ ఆఫీస్ వద్ద చూపించారు.త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కే థియేటర్స్ కు రిపీట్ ఆడియన్స్ వచ్చారు. మల్టీస్టారర్ స్టోరీ ఫైనల్ త్రివిక్రమ్, వెంకీలు కూడా సిద్ధంగా వున్నారు. దీని కోసం ఒక ఫ్యామిలీ డ్రామాని రాసుకున్నారు తివిక్రమ్. అయితే ఇది కేవలం సోలో హీరో సినిమా కాదు. దీనిని మల్టీస్టారర్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మరో హీరోగా నాని కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే స్టోరీ ఫైనల్ చేసి పెట్టుకున్నారు త్రివిక్రమ్. ఇండస్ట్రీలో కాంబినేషన్ ఈక్వేషన్లు ఎలా మారుతాయో చెప్పలేం. ప్లాన్ బి గా ఈ ప్రాజెక్ట్ రెడీ చేశారు త్రివిక్రమ్. అందుకే ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించిన వివరాలన్నీ కాస్త సీక్రెట్ గానే ఉంచారు. వెంకటేష్ కూడా సైంధవ్ మూవీ ఫినిష్ చేయడం జరిగింది. అలాగే నాని మొన్ననే హాయ్ నాన్న మూవీ ఫినిష్ చేసి మంచి హిట్ జోష్ లో ఉన్నారు. సో..ఈ ముగ్గురూ కలిస్తే లెక్క ఓ రేంజ్ లో ఉండటం ఖాయం.చూడాలి మరి..నాని, వెంకీ కాంబోలో రాబోతున్న ఈ మల్టీస్టారర్ అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో. ALSO READ:Chiranjeevi – Venkatesh – Saindhav : చిరు మూవీపై వెంకీ కామెంట్స్… సైంధవ్ విషయంలో జరిగేది ఇదే!! #allu-arjun #pushpa2 #nani #venkatesh #trivikram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి