Big 4: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒకే వేదికపై చిరు, బాలయ్య, వెంకీ, నాగ్‌.. ఎందుకంటే?

వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75 వ చిత్రం సైంధవ్‌. ఈ చిత్రం జనవరి 13 న విడుదల రానుంది. ఈ నేపత్యంలో JRC కన్వెన్షన్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈవెంట్ లో టాలీవుడ్ అగ్ర నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, హాజరు కాబోతున్నారని నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది.

Big 4: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒకే వేదికపై చిరు, బాలయ్య, వెంకీ, నాగ్‌.. ఎందుకంటే?
New Update

Saindhav Pre Release: హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం సైంధవ్‌ (Saindhav). వెంకటేష్ 75వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. నిర్మాత వెంకట్ బోయిన్ పల్లి నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ (Daggubati Venkatesh) యాక్షన్ మోడ్ లో కనిపించబోతున్నారు. వెంకటేష్ కెరీర్ లో ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది గా ఉండబోతుంది. మూవీ టీజర్ తో ప్రేక్షకులలో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. సంక్రాంతికి విడుదల కానున్న నేపత్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా వచ్చేసింది.

Also Read: Salman Khan: బాలీవుడ్ భాయ్‌జాన్‌ సల్లూ భాయ్.. బర్త్ డే స్పెషల్

అయితే వెంకటేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టాలీవుడ్ అగ్ర నటులు బాలకృష్ణ (Balakrishna), చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), ఒకే వేదిక కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. సహజంగా స్టార్ హీరోస్ అందరు ఒకే స్టేజ్ పై కనిపించడం చాలా అరుదు. వెంకటేష్ 75 వ చిత్రం కావడంతో ఈ ఈవెంట్ స్పెషల్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ వేడుకల్లో సీనియర్ నటులతో పాటు పలువురు యంగ్ హీరోస్ కుటుంబ సభ్యులు కూడా హాజరు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది నిజమైతే ఒకే స్టేజ్ తమ అభిమాన హీరోలు అందరు కనిపించడం ఫ్యాన్స్ కు పండగ అనే చెప్పాలి. సైంధవ్‌ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సైంధవ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ JRC కన్వెన్షన్ సెంటర్ లో డిసెంబర్ 27 సాయంత్రం జరగనున్నట్లు తెలిపారు.

Also Read: Suhas Movie: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

#balakrishna #saindhav-movie #hero-venkatesh #nagarjuna #venkatesh #chiranjeevi #saindhav-pre-release
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe