Vellampally Srinivas: లోకేష్‌ యాత్రకు ప్రజా స్పందన లేదు

చంద్రబాబు, వపన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. నారా లోకేష్‌ యాత్రకు ప్రజా స్పందన కరువైందని వెల్లంపల్లి ఆరోపించారు. టీడీపీ ఎంపీలు సైతం యువగళం యాత్రను బహిష్కరించారని విమర్శించారు.

Vellampalli Srinivas: సీటు మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.!
New Update

నారా లోకేష్‌ యువగళం యాత్రకు ప్రజా స్పందన కరువైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. లోకేష్‌ యాత్రలో టీడీపీ శ్రేణులు తప్ప ప్రజలు కన్పించడం లేదని ఎద్దేవా చేశారు. లోకేష్‌ యాత్రను టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌ సైతం బహిష్కరించారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో 20 నిమిషాలు నడిస్తే అది పాదయాత్ర ఎలా అవుతుందని మాజీ మంత్రి ప్రశ్నించారు. తన పుత్రుడి యాత్రకు స్పందన రాకపోవడంతోనే చంద్రబాబు తన దత్త పుత్రుడ్ని రంగంలోకి దించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై తిరుగుతున్న చంద్రబాబు.. తన హయాంలో విజయవాడలో చేసిన అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హిందూ దేవాలయాలను కూల్చి హిందూ ద్రోహిగా మారాడని మండిపడ్డారు. చంద్రబాబుకు లోకేష్‌ పాదయాత్ర మీద నమ్మకం ఉంటే ఒంటరిగా 175 స్థానాల్లో పోటీచేయాలని వెల్లంపల్లి సవాల్‌ చేశారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన వెల్లంపల్లి.. పొత్తులకు పోకుండా పవన్‌ ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్‌ ఒంటరిగా జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక పొత్తులు పెట్టు కుంటుంన్నారని విమర్శించారు. పవన్‌ ఒకప్పుడు సినిమాల్లో హీరో అన్న ఆయన.. రాజకీయాల్లోకి వచ్చి సినిమాల్లో హీరో స్థాయి నుంచి జీరో స్థాయికి దిగజారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ వ్యక్తి గతంగా విమర్శలు చేస్తున్నారన్నారు. వ్యక్తిగత విమర్శలు చేసి ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో హింస చెలరేగితే చూస్తూ ఆనందించాలని చూస్తున్నారని విమర్శించారు.

హింస వల్ల అల్లర్లు చెలరేగితే దానిని ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి రాబోయ్యేది జగన్‌ సర్కారే అని వెల్లంపల్లి జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు రౌడీ రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేయాలని చూస్తే తామేంటో చూపిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విపక్ష నాయకులు ప్రజలను తమ వైపు మళ్లించుకోవడానికి నోటికి వచ్చిన హామీలు ఇస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మొద్దని ఆయన సూచించారు.

#pawan-kalyan #lokesh #ycp #tdp #chandrababu #janasena #vellampalli-srinivas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe