టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్...వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల పెళ్ళి. చాలా రోజుల నుంచి వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ ముహూర్తం రానే వచ్చేసింది. మరో వారం రోజుల్లో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. కొన్ని రోజుల క్రితం నుంచే పెళ్ళి పనులు మొదలయిపోయాయి. ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు, హడావుడి కూడా అయిపోయాయి. లావణ్-వరుణ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. దీని కోసం వీరు ఇటలీలోని టస్కానీని డెస్టినేషన్ గా ఎంచుకున్నారు. ఇది ఒక చారిత్రాత్మక గ్రామం. తరువాత రిసార్ట్‌గా మారింది. ఇక్కడ సెలబ్రిటీ పెళ్లిల్లు ఇటీవల హాట్ టాపిక్. ఇదే వెన్యూలో వరుణ్-లావణ్య త్రిపాఠి పెళ్లి జరగనుంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మెగా ఇంట ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి బాజాలకు సమయమాసన్నమైంది. ఇప్పటికే నవవధూవరులు టస్కానీకి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని వరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వీరితో పాటూ రామ్ చరణ్ దంపతులు, వారి అమ్మాయి క్లీంకార కూడా ఇటలీ చేరుకున్నారు.
Also Read:ది గర్ల్ ఫ్రెండ్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీలో కనిపించబోతున్న నేషనల్ క్రష్
ఇక ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వారి కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ 9 న హైదరాబాద్‌లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఇప్పుడు వివాహం కూడా కుటుంబ సభ్యులు, కొద్ది మంది ఫ్రెండ్స్ మధ్యలో జరగనుంది. హల్దీ, మెహందీ, సంగీత్ తో మొదలైన పెళ్ళి వేడుకలు నాలుగు రోజుల వివాహంతో పూర్తవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన కామినేని, పవన్ కళ్యాణ్, నాగబాబు ఆయన కుటుంబం, అల్లు అర్జున్, అల్లు కుటుంబం, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వివాహానికి హాజరుకానున్నారు.
వరుణ్ తేజ్ ఇన్స్టాగ్రామ్ లో తన ప్రయాణానికి సంబంధించిన ఫోటోను షేర్ చేసాడు. అతడు ఇప్పటికే టుస్కానీలో అడుగుపెట్టాడు. పెళ్లి కోసం ఉపాసన కామినేని కూడా టుస్కానీ చేరుకున్నారు. ఆమె డబుల్ రెయిన్బో ఫోటోను షేర్ చేసింది. లొకేషన్‌ను టస్కానీ, ఇటలీ అని ట్యాగ్ చేసింది. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి నెల రోజుల పాటు ప్రపంచ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పెళ్ళి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పటివరకు ధృవీకరించలేదు.