Vallabhaneni vamsi: వల్లభనేని వంశీ అరెస్ట్‌కు రంగం సిద్ధం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీని ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు.వంశీ ఈ దాడిలో నేరుగా పాల్గొనకపోయినప్పటికీ..ఎమ్మెల్యేగా ఆయన ఆదేశాలతోనే వైసీపీ మూకలు ఈ దాడులకు దిగినట్లు సమాచారం.

Vallabhaneni vamsi: వల్లభనేని వంశీ అరెస్ట్‌కు రంగం సిద్ధం
New Update

Vallabhaneni Vamsi: కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీని 71 వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో సుమారు 18 మందిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దాడిలో మాజీ ఎమ్మెల్యే వంశీ నేరుగా పాల్గొనకపోయినప్పటికీ , ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ మూకలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే.

మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంఓ ఉండడం, వంశీ సొంత మనుషులుగా చెలామణీ అయిన పోలీసులే అధికారం చెలాయించేసరికి ఈ కేసు గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ ఆరాచకాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

టీడీపీ కార్యాలయం పై దాడికి కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్‌ సహా 15 మందిని, తర్వాత మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. మిగతావారు పరారీలో ఉన్నారు. అయితే పోలీసులు వంశీతో పాటు సహా పలువురు కీలక నిందితుల్ని వదిలేశారంటూ టీడీపీ శ్రేణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదిలా ఉంటే టీడీపీపెద్దలు కూడా వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు, నాలుగేళ్లుగా పార్టీ శ్రేణుల్ని వేధించడం, నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వంశీని అరెస్ట్‌ చేయాలనే ఒత్తిడి పెరిగింది. జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధరరావు ఈ వ్యవహారం పై ప్రత్యేక దృష్టి సారించారు.

వంశీ కుటుంబం హైదరాబాద్‌ లోనే నివసిస్తుండడం , ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా అక్కడే ఉంటున్నట్లు తెలియడంతో పోలీసులు అరెస్టుకు కార్యాచరణ చేపట్టారు. గురువారం మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌ వెళ్లాయి. అయితే వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి ఉంటారని టాక్‌.

Also read: లక్ష్మీపార్వతి ఆ హోదా తొలగింపు..

#vijayawada #ycp #arrest #ex-mla #vallabhaneni-vamsi #tdp-office-attack
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe