America : సిరియా(Syria), ఇరాక్(Iraq) లో ఇటీవల అమెరికా(America) ప్రతీకార దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని తాజాగా అమెరికా ప్రకటించింది. ఇరాన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు మరిన్ని చర్యలు ఉంటాయంటూ హెచ్చరించింది. గత శుక్రవారం జరిగిన దాడులతో ఆ ప్రాంతంలో మిలిటెంట్ గ్రూప్‌ల సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారుడు జేక్ సలీవన్(Jake Sullivan) వెల్లడించారు.
అయితే పశ్చిమాసియాలో తాము ఘర్షణ కోరుకోవడం లేదని సలీవన్ అన్నారు. అమెరికన్ల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని.. మరిన్ని భీకర దాడులు ఉంటాయంటూ హెచ్చరించారు. ఇరాన్‌లో కూడా దాడులు జరిపారా అని అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన స్పందించలేదు. శుక్రవారం జరిగిన దాడుల తర్వాత సిరియాలోని అమెరికా స్థావరంపై మరో దాడి జరిగినట్లు చెప్పారు. అయితే ఈ ఘటనలో ఎవరకీ హాని జరగలేదని చెప్పారు.
ఎదుర్కొనేందుకు సిద్దం.
ఇక ఇరాన్ సపోర్ట్‌తో ఇరాక్, సిరియాలో ఉన్న మిలిటెంట్లు(Militants).. హూతీల నుంచి భవిష్యత్తులో తమపై మరిన్ని దాడులు జరపలేరని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. అందుకే ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బైడెన్(Biden) తమ సైన్యానికి ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. ఇటీవల జోర్డాన్‌లో తమ సైనికలు మగ్గురు మరణించడంతో అమెరికా ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాక్, సిరియాలో ఇరాన్ మద్దతుదారులైన మిలిటెంట్లు, రెవల్యూషనరీ గార్డు దళ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. దాదాపు 85కు పైగా శత్రు స్థావరాలను ధ్వంసం చేశామని పేర్కొంది.
నిధలు సమకూరుస్తున్నారు
అయితే జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై జరిగిన దాడుల్లో మాకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ చెబుతున్న కూడా దాన్ని యూఎస్ ఖండిస్తోంది. ఈ దాడులకు బాధ్యత వహించిన ఇరాక్‌లోని జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని ఇరాన్ చెబుతున్నప్పటికీ.. యూఎస్ మాత్రం దాన్ని ఖండిస్తోంది. ఈ దాడులకు బాధ్యత వహించిన ఇరాక్‌లోని ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్’నకు ఐఆర్‌జీసీయే(IRGCA) నిధులు సమకూరుస్తోందని.. అలాగే ఇందుకు కావాల్సిన ట్రైనింగ్‌ను కూడా ఇస్తోందని ఆరోపించింది.