Death Sentence: ఖైదీ రక్తనాళం కనిపించక.. ఆగిపోయిన మరణశిక్ష

అమెరికాలో ఓ ఖైదీకి ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణ శిక్ష అమలు చేసేందుకు అధికారులు సిద్ధం కాగా.. వైద్యులకు అతడి రక్తనాళం కనిపించకపోవడంతో మరణశిక్ష నిలిచిపోయింది. దాదాపు గంటసేపు అతడి కాళ్లు, చేతులు, భూజాలతో పాటు ఇతర భాగాల్లో వెతికిన కనిపించకపోవడంతో శిక్ష ఆగిపోయింది.

Death Sentence: ఖైదీ రక్తనాళం కనిపించక.. ఆగిపోయిన మరణశిక్ష
New Update

అమెరికాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఖైదీకి మరణశిక్ష విధిస్తుండగా అతడి రక్తనాళం దొరకకపోవడంతో ఆ శిక్ష ఆగిపోయింది. అతనికి ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చేందుకు వైద్యులు పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ.. రక్తనాళం కనిపించలేదు. ఇక చివరికి అతడి మరణశిక్షను నిలిపివేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన థామస్‌ యూజీన్ క్రీచ్‌ (73) అనే వ్యక్తి ఓ సీరియల్‌ కిల్లర్. మూడు రాష్ట్రాల్లో ఐదు హత్యలు చేశాడు. అన్ని కేసుల్లో కూడా అతడు అనుమానితుడిగా ఉన్నాడు.

Also Read: ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్‌ లేక వృద్ధుడు మృతి.. ఎయిర్‌ ఇండియాకు భారీ జరిమానా

గంటసేపు వెతికినా దొరకలేదు

దాదాపు 50 ఏళ్లుగా అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 1981లో తోటి ఖైదీపై థామస్‌ దాడి చేయగా.. అతడు ప్రాణాలు కోల్పోయాడు. చివరికి ఈ కేసులో థామస్‌కు కోర్టు మరణశిక్షను విధించింది. అయితే అమెరికాలో మరణ శిక్ష ఎదుర్కొంటున్న దోషుల్లో ఒకరిగా ఉన్న థామస్‌కు.. శిక్ష పూర్తి చేయాలని అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే అతడ్ని ఇడాహోలోని మరణశిక్ష విధించే ఛాంబర్‌కు తీసుకెళ్లారు. ఇందులో భాగంగా అతడికి ప్రాణాంతక ఇంజెక్షన్ అమలు చేయాల్సి ఉంది. దీనికోసం వైద్యులు.. అతడి కాళ్లు, చేతులు, భుజాలతో సహా ఇతర భాగాల్లో రక్తనాళం కోసం వెతికారు. దాదాపు గంట సేపు పాటు వెతికినా కూడా సరైన ఇంజెక్షన్ ఇచ్చేందుకు సరైన రక్తనాళం దొరకలేదు. ఇక చివరికి అతడి మరణ శిక్షను నిలిపివేశారు.

మరో వారెంట్‌ పొందాల్సిందే 

అయితే థామస్‌ డెత్‌ వారెట్‌ సమయం ముగిసిపోతుండటంతో ఇతర మార్గాల కోసం ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. కానీ రాజ్యాంగబద్ధమైన విధానంలో మరణశిక్షను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని దోషి తరఫు న్యాయవాది కోర్టును ఆశ్రయించాడు. ఈ అంశంపై విచారించిన న్యాయస్థానం.. డెత్‌ వారెంట్‌ ముగిసేలోపు మళ్లీ మరణశిక్ష అమలు చేసేందుకు ప్రయత్నించొద్దని ఆదేశించింది. దీంతో శిక్ష అమలు చేసేందుకు కొత్తగా మరో వారెంట్‌ను పొందాల్సి ఉంటుంది.

Also Read: బెంగాల్‌లో 17 లక్షల మంది నకిలీ ఓటర్లు…ఈసీకి జాబితాను సమర్పించిన మమత ప్రత్యర్థి..!!

#telugu-news #usa #death-sentence #us-execution
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe