DGCA: ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్ లేక వృద్ధుడు మృతి.. ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా వీల్‌చైర్ సదుపాయం లేక ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్టులో ఓ వృద్ధుడు కుప్పకూలి మృతి చెందిన సంఘటన తెలిసిందే. దీనిపై తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA).. ఎయిర్ఇండియాకు ఏకంగా రూ.30 లక్షల జరిమానా విధించింది. By B Aravind 29 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Air India: ఇటీవల ముంబయి విమానశ్రయంలో వీల్‌ఛైర్ సదుపాయం లేక ఓ వృద్ధుడు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలి మృతి చెందిన సంఘటన గురించి తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA).. ఎయిర్ఇండియా చర్యలు తీసుకుంది. ఇలాంటి విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు ఏకంగా రూ.30 లక్షల జరిమానా విధించింది. డీజీసీఏ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Also Read: ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. వీల్ చైర్ సదుపాయం లేదు ఫిబ్రవరి 12న అమెరికా నుంచి ఎయిర్ఇండియా విమానంలో భారత్‌కు వృద్ధ దంపతులు వచ్చారు. వాళ్లు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానశ్రయంలో దిగారు. అయితే అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బంది 80 ఏళ్ల వృద్ధుడికి వీల్ చైర్ సదుపాయం కల్పించలేదు. దీంతో అతడు విమానం నుంచి టెర్మినల్ వరకు నడుచుకుంటూనే వెళ్లాడు. చివరకు ఇమిగ్రేషన్ విభాగం వద్దకు రాగానే ఆ వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై వివరణ ఇవ్వాలని.. ఎయిరిండియాకు డీజీసీఏ నోటీసులు జారీ చేసింది. ఎయిర్ ఇండియా అలసత్వం వహించింది దీనిపై స్పందించిన ఎయిర్ఇండియా.. ఆ వృద్ధిని భార్యకు వీల్‌ఛైర్ సమకూర్చినట్లు తెలిపింది. వీల్ఛైర్లకు భారీ డిమాండ్ ఉండటం వల్ల మరొకటి వచ్చేలోపు కొద్దిసేపు ఉండాలని వారి చెప్పినట్లు పేర్కొంది. కానీ ఆ వృద్ధుడు మాత్రం తన భార్యతో కలిసి టెర్మినల్ వరకు నడుచుకుంటూ వెళ్లారని .. ఇమిగ్రేషన్ తనిఖీ కోసం ఎదురుచూస్తుండగా.. తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు పేర్కొంది. అయితే ఎయిర్ఇండియా స్పందనను పరిశీలించిన డీజీసీఏ.. వీల్‌చైర్ అందించడంలో అలసత్వం వహించినట్లు పేర్కొంది. దీంతో చివరికి ఎయిర్ఇండియాపై రూ.30 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సరైన సంఖ్యలో వీల్చైర్లను అందుబాటులలో ఉంచాలని ఎయిర్ఇండియాకు సూచనలు చేసింది. Also read: బెంగాల్లో 17 లక్షల మంది నకిలీ ఓటర్లు…ఈసీకి జాబితాను సమర్పించిన మమత ప్రత్యర్థి..!! #mumbai #national-news #dgca #air-india #telugu-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి