Telangana: ఆరు నెలల్లోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీజేపీకి ఎక్కువగా ఓట్లు వచ్చాయని.. ఆరు నెలల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. By B Aravind 06 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో బీజేపీ 8 సీట్లు సాధించడంతో.. ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేసిందని విమర్శలు చేశారు. ' లోక్‌సభ ఎన్నికల్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎక్కువ ఓట్లు వచ్చాయి. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పోటీ చేయలేదు. ఎంఐఎం పార్టీ పోటీ చేసింది. ఆరు నెలల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైంది. Also Read: 30 ఏళ్ల నాటి పొలిటికల్ సీన్ రిపీట్.. జగన్ కోలుకోవడానికి కనీసం పదేళ్లు? బీజేపీకి తెలంగాణ ప్రజలు 35 శాతానికి పైగా ఓట్లు వేసి ఎక్కువ స్థానాల్లో గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం ఒక్క శాతం మాత్రమే ఓటింగ్ పెరిగింది. బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రాలేవు. గత ఎన్నికల్లో రేవంత్ గెలిచిన మల్కాజ్‌గిరిలో కూడా మేము గెలిచాం. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దపేట ఉన్న మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా గెలిచాం. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎలా అమలుచేస్తారో బీజేపీ ప్రశ్నిస్తోంది. అమిత్ షా పై తప్పుడు కేసు పెట్టారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరిస్తామని' కిషన్ రెడ్డి అన్నారు. Also Read: హైదరాబాద్, ఒంగోలులో ఈడీ దాడులు #telugu-news #congress #national-news #bjp #bjp-kishan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి