Congress v/s BJP : తెలంగాణ(Telangana) లో రెండు రోజుల పాటు జరిగిన ప్రధాని మోదీ(PM Modi) పర్యటన ముగిసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) రాష్ట్ర పార్టీ కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రధాని సభలు విజయవంతమయ్యాయని అన్నారు. అయితే ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దన్న అని అనడం రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. దీనిపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానిని సీఎం రేవంత్ పెద్దన్న అని ఎందుకు అన్నారో ఆయన్నే అడగాలని చెప్పారు.
Also Read: బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తుపై ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు
హామీలేమయ్యాయి..?
సీఎం రేవంత్(CM Revanth Reddy) ప్రధాని మోదీని పెద్దన్న అన్న మాత్రాన.. కాంగ్రెస్, బీజేపీ ఒకటి అయినట్లేనా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి కాంగ్రెస్ వద్ద స్పష్టత లేదన్నారు. అవి కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ, 4 వేల పింఛనుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలతో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా కార్యక్రమాలు చేపడతాయని పేర్కొన్నారు. అలాగే బీజేపీ మేనిఫెస్టో కోసం బుధవారం నుంచి సలహాలు స్వీకరిస్తామని తెలిపారు.
సుడిగాలి పర్యటనలు చేస్తున్న మోదీ
ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలకు ప్రణాళికలు రచిస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పార్టీ.. మోదీ సర్కార్‌ను గద్దె దించాలని కాంగ్రెస్ సర్కార్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవునుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Also read: నది కింద మెట్రో..భారత్ మరో అద్భుతం