Telangana Politics: తెలంగాణ ప్రజల చెవుల్లో కేసీఆర్ గులాబీ పూలు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై కిషన్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్ సంపదను పెంచలేదు అవినీతిని పెంచారని కేంద్రమంత్రి దుయ్యబట్టారు. బెస్ట్ డ్రింకింగ్ పాలసీని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు చేయకపోగా, కొత్త హామీలు ఇచ్చారని ఫైర్‌ అయ్యారు.

Telangana Politics: తెలంగాణ ప్రజల చెవుల్లో కేసీఆర్ గులాబీ పూలు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
New Update

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై కిషన్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్ సంపదను పెంచలేదు అవినీతిని పెంచారని కేంద్రమంత్రి దుయ్యబట్టారు. బెస్ట్ డ్రింకింగ్ పాలసీని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు చేయకపోగా, కొత్త హామీలు ఇచ్చారని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ప్రజల చెవుల్లో సీఎం కేసీఆర్ గులాబీ పూలు పెడుతున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం సకల ద్రోహీ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడాడూ.. కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల చెవుల్లో గులాబీ పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం 9 ఏళ్లుగా మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. కేజీ నుంచి పీజీ వరకు విద్య ఏమైంది..? అని ప్రశ్నించారు. 2014, 2018-19 పార్లమెంట్ ఎన్నికల్లో ఏయే హామీలు ఇచ్చారో చెబుతారా..? అని కేసీఆర్‌ని ప్రశ్నించారు. సీఎం మాటలు కోటలు దాటుతాయి తప్ప.. చేసిదే ఏం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. వరంగల్‌లో టెక్స్ టైల్స్ సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంత వరక స్థలం కూడా చూపించలేదని ఫైర్‌ అయ్యారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఏమయ్యాయి..? అని ప్రశ్నించారు. కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. హైదరాబాద్‌కి ఉత్తరాన ఇంటర్నేషనల్ ఎయిర్‌ఫోర్ట్ ఏర్పాటు చేస్తానని తెలిపారు.. దాని గురించి ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల అమలుపై కేసీఆర్ చర్చకు వస్తారా..? అంటూ సవాల్‌ చేశారు.

ఇది కూడా చదవండి: అత్తను తుపాకితో కాల్చి చంపిన కానిస్టేబుల్.. హనుమకొండ జిల్లాలో కాల్పుల కలకలం

గులాబీ పువ్వులతో గ్రాఫిక్స్ చూయించి జీహెచ్‌ఏంసీ ఎన్నికలల్లో ప్రజలను మోసం చేసి కేసీఆర్ గెలిచారని కిషన్ రెడ్డి ఆరోపించారు. 84 వేల పుస్తకాలు చదివిన తెలివితో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు రాష్ట్రానికి వస్తున్న రెవెన్యు 80 శాతం వడ్డీలకే పోతుందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు మూత పడ్డాయని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ చెప్పేవన్నీ కల్లబొల్లి మాటలు, నీటి మూటలని విమర్శించారు. కాంగ్రెస్, బీఅర్ఎస్ ప్రజలను వంచించే పార్టీలు.. ప్రజలు గమనించాలని కోరారు. నిరుద్యోగులకు ఇంతవరకు నిరుద్యోగ భృతి  ఇవ్వలేదు కానీ.. 90 లక్షల మందికి రూ.3000 ఇస్తానంటే ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరని కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలో అన్ని ప్రభుత్వాలు పెట్రోల్‌పై ట్యాక్సి తగ్గించుకుంటే తెలంగాణ ప్రభుత్వం తగ్గించలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: దుర్గగుడిలో ఏర్పాట్లపై ఏపీ మంత్రి ఆగ్రహం

#hyderabad #cm-kcr #media-conference #criticized #union-minister-kishan-reddy #bjp-state-office
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe