AP Politics: దేశంలో ఎక్కడా లేని చట్టాలు ఏపీలో ఉన్నాయి: బుద్దా వెంకన్న
టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడా లేని రెండు చట్టాలు ఏపీ అమలవుతున్నాయని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం నిరంతరం ఉండదు ఈ విషయం పోలీసులు గమనించి నడుచుకోవాలన్నారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఏపీలో నిరసనలు చేసేందుకు కూడా ఇక్కడ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు.