India's space economy: భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికీ ఎంతవుతుందో తెలుసా..

భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి ఇది 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఇండియాలో ఏర్పాటైన ‘అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ వంటి సంస్థలతో భారత అంతరిక్ష రంగ పురోగతికి బలమైన పునాదులు పడతాయన్నారు.

New Update
India's space economy: భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికీ ఎంతవుతుందో తెలుసా..

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2040 నాటికి ఇది 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ మొత్తం 100 బిలియన్ డాలర్ల వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని పలు విదేశీ సంస్థలు అంచనా వేసినట్లు చెప్పారు. అలాగే భవిష్యత్‌లో శాస్త్రవేత్తలకు మేరుగైన పని వాతావరణం ఏర్పడుతుందని.. కానీ ప్రస్తుతం మాత్రం ఇండియన్ స్పేస్ ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా లేదన్నారు. ఇప్పుడు కేవలం 8 బిలియన్ డాలర్లు మాత్రమే ఉందని.. అయినా కూడా మనం వేగంగా వృద్ధి నమోదు చేస్తున్నామని చెప్పారు. ఐరోపా ఉపగ్రహాల ప్రయోగాల వల్ల 230-240 మిలియన్ యూరోలు, అమెరికా ఉపగ్రహాల ప్రయోగాల నుంచి 170-180 మిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. ఇస్రో తొలి రాకెట్‌ను ప్రయోగించి 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా జితేంద్ర సింగ్‌ ఓ వార్త సంస్థతో పలు విషయాలు పంచుకున్నారు.

Also Read: ఒకే టికెట్ పై 56 రోజుల జర్నీ.. ఇండియన్ రైల్వే ఈ అదిరిపోయే ఆఫర్ గురించి మీకు తెలుసా!?

అమెరికాలో లాగే ఇండియాలో ఏర్పాటైన ‘అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ వంటి సంస్థలతో భారత అంతరిక్ష రంగ పురోగతికి బలమైన పునాదులు పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి వాటివల్ల మన అంతరిక్ష రంగంలోకి 70 శాతం నిధులు ప్రభుత్వేతర రంగాల నుంచే వస్తాయని పేర్కొన్నారు. మనం వనరుల కొరతను కూడా ఎదుర్కొన్నామని.. సాంకేతికంగా మనకున్న అపార అనుభవంతో దాన్ని అధిగమించామని పేర్కొన్నారు. చందమామ పైకి ఇతర దేశాలు తమ వ్యోమనౌకలు పంపినప్పటికీ.. అక్కడ నీటి జాడలను ముందుగా కనుక్కుంది మనమేనని తెలిపారు.

అలాగే అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థలను ఆహ్వానించాలనే ప్రభుత్వ నిర్ణయం ఓ కీలకమైన మైలురాయిగా మారిపోతుందని జితేంద్ర సింగ్ భావిస్తున్నారు. దీంతో ఒకవైపు నిధులు మరోవైపు సాంకేతిక పరంగా అదనపు వనరులు వస్తాయన్నారు. ఇక ఇస్రో చేపట్టబోయే గగన్‌యాన్‌ మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని.. ఈ ప్రాజెక్టులో భాగంగా 2025 నాటికి ఓ అస్ట్రోనాట్‌ను రోదసిలోకి పంపి సురక్షితంగా తీసుకొస్తుందని పేర్కొన్నారు. అయితే ఇది ప్రయోగించే మూడు నెలల ముందు ఓ రోబోను పంపుతామని.. అది కూడా ఒక ఆస్ట్రోనాట్‌లాగే పనిచేస్తుందని స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు