Lok Sabha Election Result: మ్యాజిక్ ఫిగర్‌కు దూరంలో బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు మంతనాలు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్డీయే 295 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇండియా కూటమికి 231 సీట్లలో మెజీర్టీతో దూసుకుపోతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ మంతనాలు జరుపుతోంది. By B Aravind 04 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్డీయే 295 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇండియా కూటమికి 231 సీట్లలో మెజీర్టీతో దూసుకుపోతోంది. బీజేపీ 243 స్థానాల్లోనే లీడింగ్‌లో ఉన్న నేపథ్యంలో.. సొంతంగా మ్యాజిగ్ ఫిగర్ 271 దాటని పరిస్థితి నెలకొంది. దాదాపు 30 సీట్ల దూరంలో కమలం పార్టీ మెజార్టీకి దురంగా ఉండటంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. దీంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాల అవసరం తప్పనిసరి కానుంది. ఈ కమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. Also Read: లోక్‌సభ ఎన్నికల్లో ఆ వైఫల్యాలే కాంగ్రెస్‌ను దెబ్బతీశాయా ? ఈ సమావేశానికి నడ్డాతో సహా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం మిత్రపక్షాలతో సంప్రదింపులపై చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఎన్డీయే కూటమి భేటీకి అమిత్ షా పిలుపునిచ్చారు. మరోవైపు పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాతే తన నిర్ణయం చెప్తానని నితీష్ కుమార్ అన్నారు. Also read: గోడకేసి కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్.. ఏకంగా నాలుగోసారి సీఎంగా చంద్రబాబు రికార్డు..! #telugu-news #congress #bjp #nda #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి