Central Cabinet Decisions: తెలంగాణపై కేంద్రం వరాల జల్లు.. ఎట్టకేలకు కృష్ణా జలాలపై స్పందన..

ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్న కృష్ణా నీళ్ల సమస్యకు పరిష్కారం చూపుతామంటూ కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు.. సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పసుపు బోర్డు ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Telangana: 'కేసీఆర్‌ నేరస్తుడు.. ఆయనను వదిలిపెట్టం'.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్..
New Update

Union Cabinet Says Good News to Telangana: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురుపించింది. బుధవారం నాడు ఢిల్లీ(Delhi)లో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్న కృష్ణా(Krishna River) నీళ్ల సమస్యకు పరిష్కారం చూపుతామంటూ కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు.. సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పసుపు బోర్డు ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటో ఓసారి చూద్దాం..

తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 3 కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రధానంగా కృష్ణా నీటి వివాదంపై క్లారిటీ ఇచ్చింది. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయం నుంచి ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య కృష్ణా జలాల వాటా విషయంలో వివాదం నడుస్తోంది. 1976లో కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 819 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగింది. 2004లో కృష్ణా ట్రిబ్యునల్ -2 ఏర్పాటైంది. 2013లో అవార్డ్ ఇచ్చినా గెజిట్ పబ్లిష్ కాలేదు. 2014లో తెలంగాణ ఏర్పాటైన తరువాత వాటాల విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరింది. అయితే, ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని కోరింది. తద్వారా దీనికి పరిష్కారం చూస్తామని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం కూడా పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ఆ మేరకు న్యాయపరమైన అంశాలన్నీ పరిశీలించి, ఉన్న ట్రిబ్యునల్ రద్దు చేయకుండా ఉన్న ట్రిబ్యునల్ కు బాధ్యతలు ఇవ్వొచ్చు అని సొలిసిటర్ జనరల్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న కృష్ణా ట్రిబ్యునల్ -2 కు విధివిధానాలు ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వాటా తేల్చడం కోసం కృష్ణా ట్రిబ్యునల్-2 కు బాధ్యత అప్పగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విభజన చట్టంలో ఉన్న సెక్షన్ 89కు ఇబ్బంది లేకుండా ట్రిబ్యునల్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా కృష్ణా పరివాహక ప్రాంతం ప్రజలు, ముఖ్యంగా రైతులకు బోలెడు ప్రయోజనం కలుగుతుంది. నీళ్ళు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం సాగింది. నీటి సమస్య పరిష్కారంలో ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుంది' అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి గ్రీన్ సిగ్నల్..

ములుగు జిల్లాల్లో సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో 9.08% ట్రైబల్ జనాభా ఉంది. వారిలో అక్షరాస్యత 49% మాత్రమే ఉంది. ట్రైబల్ మహిళల్లో అది మరింత తక్కువగా 39% మాత్రమే ఉంది. గిరిజన విశ్వవిద్యాలయం ద్వారా గిరిజన ఆదివాసీలకు ప్రయోజనం కలుగుతుంది. రూ. 889 కోట్లతో యూజీసీ ద్వారా కేంద్ర విద్యాశాఖ ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది. ములుగులో ఏర్పాటయ్యే ఈ యూనివర్సిటీతో చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా లాభం ఉంటుంది. మొదటి ఫేస్ వెంటనే ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. గిరిజనుల హక్కులు, ఆచారాలు, సంస్కృతిని కాపాడేందుకు ఈ యూనివర్సిటీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అడవుల మీద ఆధారపడే ఆర్థిక విధానాల మీద కూడా యూనివర్సిటీ దృష్టి సారిస్తుంది. 30% పైగా గిరిజన జనాభా ఉన్నా ములుగు జిల్లాలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు అవుతోంది. ఈ జిల్లాలో వనదేవతలుగా పేరొందిన సమ్మక్క సారక్క పేరు మీద యూనివర్సిటీకి నామకరణం చేయడంపట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నెరవేరనున్న చిరకాల స్వప్నం..

నిజామాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరనున్నది. పసుపు బోర్డు ఏర్పాటు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో పసుపు బోర్డు ఏర్పాటుకు సెంట్రల్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కాగా, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కీలకమైన మూడు నిర్ణయాలను తీసుకోవడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

Ranbir Kapoor: ఆన్‌లైన్ బెట్టింగ్‌ కేసులో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ నోటీసులు..

CM Jagan Delhi Tour: ఒక రోజు ముందుగానే ఢిల్లీకి జగన్.. ముందస్తు ఎన్నికల కోసమేనా?

#telangana-news #krishna-river #andhra-pradesh-news #kishan-reddy #telangana-government #telangana-state #union-cabinet #modi-for-telangana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe