Amit Shah on UCC : వాట్ ఇండియా థింక్స్ టుడే(WITT) పవర్ కాన్ఫరెన్స్‌లో హోం మంత్రి అమిత్ షా(Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు యూనిఫాం సివిల్ కోడ్ (UCC) పై కీలక విషయాలు వెల్లడించారు. ఎన్నికల తర్వాత దేశంలో UCC అమలు చేస్తామన్నారు. UCC కొంతమందికి రాజకీయ సమస్య కావచ్చు అని.. అయితే ఇది ఒక సామాజిక సంస్కరణ అని నొక్కి చెప్పారు అమిత్‌షా. దేశంలో ఏ మతం ప్రాతిపదికన చట్టం ఉండకూడదని అభిప్రాయపడ్డారు. దేశం చట్టాలు నేటి పరిస్థితులకు అనుగుణంగా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలన్నారు. తగిన సమయంలో ఒకే విధమైన పౌర చట్టాన్ని తీసుకురావాలని మన రాజ్యాంగ అధికరణ 44 సూచిస్తుందన్నారు అమిత్‌షా.
దేశవ్యాప్తంగా అమలు:
ఉత్తరాఖండ్(Uttarakhand) లో యూసీసీని అమలుపైపా అమిత్‌షా స్పందించారు. దీనిపై సామాజిక, న్యాయ, చట్టబద్ధమైన పరిశీలన జరగాలని.. ఇది చాలా పెద్ద చట్టమన్నారు. ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తామన్నారు. ఉత్తరాఖండ్‌లో దీన్ని మొదటిగా తీసుకురావడంపై అమిత్ షా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పెద్ద సంస్కరణ అని, యుసీసీపై విస్తృత చర్చ జరగాలన్నారు. ఆపై దేశంలో దీనిని అమలు చేయాలని అభిప్రాయపడ్డారు.
యూసీసీని హిందూ కోడ్ బిల్లుగా పేర్కొంటూ.. కొందరు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షా ఫైర్ అయ్యారు. హిందూ మతాన్ని అనుసరించే ప్రజలు కూడా అనేక సామాజిక సంస్కరణలను స్వీకరించారన్నారు. వరకట్న నిరోధక చట్టం చేశామని.. ఎవరూ నిరసన తెలపలేదని గుర్తు చేశారు. బహుభార్యత్వాన్ని రద్దు చేసిన విషయం మరువద్దన్నారు. అప్పుడు కూడా ఎవరూ నిరసన తెలపలేదన్నారు.
బీజేపీ టార్గెట్ అదేనా?
నరేంద్ర మోదీ(Narendra Modi) అభివృద్ధి చెందిన భారతదేశం(India) గురించి కలలు కంటున్నారని బీజేపీ(BJP) చెబుతోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోందని.. ఆయన నాయకత్వంలో ఈ దేశం ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 లాంటి చారిత్రక తప్పిదాలను సరిదిద్దిందని అంటోంది. దేశాన్ని అభివృద్ధి చెందిన, ఐక్యంగా, సామరస్యపూర్వకంగా, స్వావలంబనతో కూడిన దేశంగా మార్చేందుకు ప్రధానమంత్రి చేస్తున్న మహా యాగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ప్రధానంగా హైలెట్ చేస్తోంది బీజేపీ. ఈ సివిల్ కోడ్ కింద కులం, మతం, ప్రాంతం, లింగం ఆధారంగా వివక్ష చూపే వ్యక్తిగత పౌర విషయాలకు సంబంధించిన అన్ని చట్టాలలో ఏకరూపతను తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్టుగా కమలనాథులు ప్రచారం చేస్తున్నారు.
Also Read : BJP Yatra : మోదీ.. ప్రయాణం అసమానం.. ఈ పాదయాత్ర జీవితకాల అనుభవం : బీజేపీ
Also Read : BJP MP List: బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే!