Free Bus: ఆ బస్సులు ఎక్కొద్దు ప్లీజ్.. మహిళలకు ఆర్టీసీ షాక్!
మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. తక్కువ దూరం వెళ్లే మహిళలు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కాకుండా పల్లెవెలుగు బస్సు ఎక్కాలని సూచించారు సజ్జనార్. ఇకపై అనుమతించిన స్టేజీల్లోనే బస్సులు ఆపనున్నట్లు స్పష్టం చేశారు.