Ananthapuram: అనంతపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్డెన్ ఆకృత్యాలు.!
అనంతపురంలోని సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్లో వార్డెన్ శివశంకర వర ప్రసాద్ ఆకృత్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. హాస్టల్ గదిలో తన రూమ్ ను ఏకంగా బార్ గా మార్చేశాడు. ప్రతిరోజు మద్యం తాగుతూ విద్యార్థులను చితకబాదుతున్నట్లు తెలుస్తోంది.
Movies : నాకింకా 30 ఏళ్ళే.. మళ్ళీ పెళ్ళి చేసుకుంటా - నీహారిక
ఎవరైనా జీవితాంతం కలిసి ఉండాలనే పెళ్ళి చేసుకుంటారు. విడిపోతామని తెలిస్తే అంత ఖర్చు పెట్టి చేసుకోరు. విడాకుల తర్వాత ఎవరి మీద ఆధారపడకుండా బతకడం ఎలానో నేర్చుకున్నాను అని చెబుతున్న మెగాడాటర్ నీహారిక...మళ్ళీ పెళ్ళి చేసుకుంటానని తెలిపింది. తనకి ఇంకా 30 ఏళ్ళే అని కూడా చెబుతోంది.
Telangana:గవర్నమెంటు స్కూలు విద్యార్ధులకు శుభవార్త..బూట్లు, టై, బ్యాగు, బెల్ట్...
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు విద్యాశాఖాధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటి వరకు స్కూళ్ళల్లో ఇస్తున్న యూనిఫార్మ్స్‌తో పాటూ షూస్, బ్యాగ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. దీని బడ్జెట్ ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి పంపించారు.
CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది మార్పు
సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చివేస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత, అధికారిక సమాచారం ఇతరులకు చేరవేస్తున్నారనే అనుమానాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే సీఎం కాన్వాయ్ లో కూడా మార్పులు చేసింది.
Alia Bhatt Ram Mandir:అలియా భట్ చీర ధరే కాదు..ఆ చీర కొంగులో ఉన్న ప్రత్యేక తెలుస్తే...ఆశ్చర్యపోవడం ఖాయం..!!
అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఎంతో మంది వీఐపీలు హాజరయ్యారు. అందులో బాలీవుడ్ నటి అలియాభట్ దంపతులు కూడా ఉన్నారు. ఈ వేడుకలో అలియా ధరించిన చీర సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలించింది. అలియా చీరకొంగులో రామాయణం ఇతివృతాన్ని డిజైన్ చేశారు. ఈ చీర ధర రూ. 45వేలు.
China : చైనాను కుదిపేసింది.. ఢిల్లీని వణికించింది
చైనాను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. అక్కడి దక్సిణ ప్రాంతాన్ని దడదడలాడించింది. దీంతో చైనాలో బీటలు వారాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ ధ్వంసం అయింది. చైనా భూకంపం ప్రభావం మన దేశ రాజధాని ఢిల్లీపైనా పడింది.
Hamas-Israel War: ఇంకా కొనసాగుతున్న దాడులు.. గాజాలో 25 వేల మందికిపైగా మృతి
హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 25 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందినట్లు గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. గత 24 గంటల్లోనే 178 చనిపోగా.. 300 మంది గాయాలపాలనైట్లు పేర్కొంది.
Telangana :సౌదీ అరెబియాలో జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
తెలంగాణలో పెట్టబడులు సాధనలో భాగంగా సౌదీ అరెబియాలో జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వరుస భేటీల్లో పాల్గొన్నారు.తెలంగాణలో పెట్టబడులు పెట్టడానికి ముందుకురావాలని పలు బహుళజాతి కంపెనీలకు పిలుపునిచ్చారు.