/rtv/media/media_files/2025/03/24/m47QriOYt6cnP8nZCV8Q.jpg)
Madhya Pradesh bus accident Photograph: (Madhya Pradesh bus accident)
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దేవుడిని దర్శించుకోవడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కి చెందిన 12 మంది కాశీ, అయోధ్యతో పాటు పలు ఆలయాలను సందర్శించుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆ ఆలయాలను దర్శించుకుని తిరిగి బస్సులో వస్తుండగా మధ్యప్రదేశ్‌లో లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.
ఇది కూడా చూడండి: Delhi Railway station : ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన ఢిల్లీ రైల్వే స్టేషన్!
3 killed, 25 injured as bus overturns in MP's Jabalpurhttps://t.co/cdoDj8PJpc#Accident#RoadAccident#BusAccident#Jabalpur#MadhyaPradeshpic.twitter.com/t66ghRSPob
— NewsDrum (@thenewsdrum) March 23, 2025
ఇది కూడా చూడండి:USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతిs
తుక్కు షాపు నడిపిస్తూ..
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కలికుడ గ్రామానికి చెందిన పెద్దగొల్ల మల్లమ్మ(50) అనే ఆవిడ ఎన్నో ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. కూకట్‌పల్లిలో ఉంటున్న ఈమె బోరబండ చౌరస్తాలో తుక్కు షాపు నడిపిస్తూ జీవనం సాగిస్తోంది. అయితే ఈమె భర్త 15 ఏళ్ల క్రితమే మరణించారు. దీంతో షాపు నడుపుతూ జీవనం సాగిస్తోంది.
ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!
ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తల్లికి సాయంగా ఉండగా.. చిన్న కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. అయితే బస్సు లోయలో పడిపోవడంతో ఈమెతో పాటు అదే కాలనీకి చెందిన మరో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మిగతా వారంతా తీవ్రగాయాల పాలయ్యారు. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇది కూడా చూడండి:Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్