Hyderabad: భారీ కుంభకోణం.. రూ.175 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ భారీ సైబర్ కుంభకోణం బయటపడింది. షంషీర్ గంజ్ SBIని బురిడీ కొట్టించి ఇద్దరు ఆటో డ్రైవర్లు ఏకంగా రూ.175 కోట్లు కాజేశారు. ఈ నిధులను క్రిప్టో కరెన్సీ ద్వారా సైబర్ నేరగాళ్లకు పంపించారు. By B Aravind 26 Aug 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్‌లో చాలావరకు సైబర్ కేసులు నమోదయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ భారీ సైబర్ కుంభకోణం బయటపడింది. బ్యాంకును బురిడీ కొట్టించి ఏకంగా రూ.175 కోట్లు కాజేశారు. పాతబస్తీలో ఉన్న బ్యాంకు నుంచి ఈ లావాదేవీలు జరిగాయి. అయితే ఈ సైబర్ నేరగాళ్లకు ఇద్దరు ఆటో డ్రైవర్లు కూడా సహకరించారు. షంషీర్ గంజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో 6 బ్యాంక్ ఖాతాలు ఈ ఆటో డ్రైవర్లు ఓపెన్ చేశారు. వీళ్లిద్దరి ద్వారా సైబర్ నేరగాళ్లు రూ.175 కోట్లు లావాదేవీలు జరిపారు. Also read: సంచలనం సృష్టిస్తున్న ముంబైనటి వేధింపుల వ్యవహారం..తెర వెనుక కీలక నేత హైదరాబాద్ నుంచి దుబాయ్, ఇండోనేషియా, కంబోడియాలకు ఈ నిధులను క్రిప్టో కరెన్సీ ద్వారా ఈ ఆటో డ్రైవర్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. చివరికి SBIలో ఈ అక్రమ లావాదేవీలు జరిగినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించించింది. కేవలం రెండు నెలల్లోనే 6 అకౌంట్ల నుంచి రూ.175 కోట్లు కొల్లగొట్టారు. ఈ ఆటో డ్రైవర్లు అహ్మద్ షాహిద్, బిన్ అహ్మద్‌లుగా పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్టు విచారణ చేస్తున్నారు. Also read: సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి సీఎం రేవంత్ ఆర్థిక సాయం.. ఏంతంటే ? #telugu-news #telangana #hyderabad #sbi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి