యావత్ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నఅయోధ్య (Ayodhya) రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం మరో 5 రోజుల్లో జరగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు ప్రపంచ నలుమూలాల ఉన్న హిందువులంతా ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు. విదేశాల్లో ఉన్న వారు కొందరు రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొనేందుకు భారత్ కు కూడా వస్తున్నారు.
కానీ కార్యక్రమం దగ్గర పడుతున్న కొద్ది కూడా కర్ణాటక కాంగ్రెస్ (Karnataka Congress) ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద, రామ మందిర ప్రతిష్ఠ మీద వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రం ఆపడం లేదు. ఈ దారిలోకి తాజాగా మంత్రి రాజన్న(Minister Rajanna) కూడా వచ్చి చేరారు. రెండు బొమ్మలను టెంటులో ఉంటి వాటినే రాముడిగా కొలవాలి అంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.
రాజన్న కర్ణాటక సమచార శాఖ మంత్రిగా పని చేస్తున్న రాజన్న..బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత తాను అయోధ్యలో పర్యటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..రాముడి పేరుతో బీజేపీ ప్రజలందరినీ పిచ్చి వాళ్లని చేస్తుంది.
రెండు బొమ్మలను టెంటులో పెట్టి..
బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత తాను అయోధ్యకి వెళ్లినట్లు వివరించారు. రెండు బొమ్మలను టెంటులో పెట్టి రాముడు అంటున్నారు. అయోధ్య రామ మందిరాన్ని ఇతర రామాలయాలతో వర్ణిస్తూ..అయోధ్య రామ మందిరం ఏమి అంత పవిత్రమైనది కాదు. ఎన్నో వేల ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయాలు భారత్ లో చాలా ఉన్నాయి.
ప్రజలను మోసం చేయడమే బీజేపీ పనిగా..
పుణ్యక్షేత్రాలను, దేవాలయాలను బీజేపీ విస్మరిస్తోంది. ప్రజలను మోసం చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. అయోధ్య రామ మందిరం మీద కర్నాటక ప్రభుత్వ మంత్రులు పదేపదే విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలా రామ మందిర వేడుక ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వేడుకకు తాము హాజరు కావడం లేదని ఇటీవల ప్రకటించింది.ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం తాను జనవరి 22 తర్వాత అయోధ్య రామ మందిరాన్ని తప్పకుండా సందర్శిస్తానని చెప్పారు.
Also read: చలికాలంలో పిల్లలు వ్యాధులకు దూరంగా ఉండాలంటే..చిటికెడు ఇది తినిపించండి చాలు!