TVS Company : మిచౌంగ్ తుఫాను బాధితులకు అండగా టీవీఎస్ కంపెనీ.. మిచౌంగ్ తుఫాను ప్రభావానికి తమిళనాడులోని చెన్నైతో పాటు పలు జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీంతో వారికి సాయం చేసేందుకు ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ ముందుకొచ్చింది. సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3 కోట్లు విరాళం అందించింది. By B Aravind 09 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి TVS Company Assurance : మిచౌంగ్ తుఫాను(Cyclone Michaung) తమిళనాడు ప్రజల్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. చైన్నై సహా చుట్టుపక్కల జిల్లాల్లో జనజీవనం స్థంభించిపోయింది. ఈ తుఫాను ధాటికి 12 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రజలకు సాయం చేసేందుకు ప్రముఖ వాహన సంస్థ టీసీఎస్ ముందుకొచ్చింది. తమిళనాడులో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3 కోట్లు విరాళం అందించింది. అయితే ఈ విషయాన్ని టీసీఎస్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మిచౌంగ్ తుపాను వల్ల తమిళనాడు ప్రజలు తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని.. వారిని కాపాడేందుకు తమ వంతు కృషి చేయాలనుకున్నాయని టీవీఎస్ మోటార్ కో-మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు తెలిపారు. Also read: బస్సు ఫ్రీ అని భార్యలు ఊర్లు తిరిగితే.. భర్తలంతా బార్లకే.. ఫన్నీ మీమ్స్ వైరల్ అలాగే వివిధ జిల్లాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న తమ కస్టమర్లకు అదనంగా వాహన తనిఖీ సర్వీసును కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. మిచౌంగ్ తుపాను ప్రభావానికి తమిళనాడు(Tamil Nadu) తో సహా.. ఆంద్రప్రదేశ్(Andhra Pradesh) లోని పలు జిల్లాల ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో మహీంద్రా, హ్యూండాయ్, ఆడి, మారుతీ సుజూకీ, వోక్స్‌వ్యాగన్ కంపెనీలు కూడా తమ సాయాన్ని ప్రకటించాయి. అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తమ కస్టమర్లకు సమగ్ర వాహన తనిఖీ సర్వీసును అందిస్తామని నిర్ణయం తీసుకుంది. Also Read: రేపు తిరుపతికి ఉత్తమ్.. ఇప్పటికైనా తీస్తారా గడ్డమ్? #telugu-news #tamil-nadu #national-news #cyclone-michaung #michaung-cyclone #tvs-company మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి