Michaung Cyclone: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో 12 మంది మృతి
తమిళనాడులోని చెన్నై, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో 12 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వరదల్లో చిక్కుకొని, భవనాలు కూలిపోయి, చెట్లు విరిగిపడి, వీళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడ పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.