Chandrababu arrest: చంద్రబాబు అరెస్ట్‌ను ఖడించిన తుమ్మల నాగేశ్వరరావు

చంద్రబాబు నాయుడ్ని అప్రజాస్వామికంగా అరెస్ట్‌ చేశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు.

New Update
Chandrababu arrest: చంద్రబాబు అరెస్ట్‌ను ఖడించిన తుమ్మల నాగేశ్వరరావు

చంద్రబాబు నాయుడ్ని అప్రజాస్వామికంగా అరెస్ట్‌ చేశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. ఏపీ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్మల.. మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా రాజ్యాంగ హక్కులను కాలారాస్తూ రాజకీయ కక్షతో చంద్రబాబును అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. సుమారు 15 సంవత్సరాల పాటు సీఎంగా పని చేసిన చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తూ.. కట్టుకథలతో ఆయన ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కనీసం న్యాయ సూత్రాలు పాటించకుండా చంద్రబాబును అగౌరపరిచే విధంగా వ్యవహరించారని తుమ్మల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నంద్యాల పట్టణంలోని జ్ఞానపురం ఆర్కే ఫంక్షన్ హాల్‌లో శనివారం అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగగా.. పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. కాగా చంద్రబాబుపై సెక్షన్లు 120B (నేరపూరిత కుట్ర), 420 (మోసం చేయడం నిజాయితీగా ఆస్తుల పంపిణీని ప్రేరేపించడం), 465 (ఫోర్జరీ) సహా సంబంధిత IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో పాటు ఏపీ సీఐడీ కూడా ఆయనపై అవినీతి నిరోధక చట్టాన్ని ప్రయోగించింది. మరోవైపు ఈ స్కిల్‌ డెవల్‌ప్‌మెంట్ స్కామ్‌పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో APSSDC ఏర్పాటైంది. నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా నిరుద్యోగ యువత సాధికారతపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది. 3,300 కోట్ల రూపాయల కుంభకోణంపై AP CID మార్చిలో దర్యాప్తు ప్రారంభించింది. సరైన టెండర్ ప్రక్రియను అనుసరించకుండా ప్రాజెక్ట్ ప్రారంభించారన్న ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుంచి ప్రాజెక్ట్‌కి ఆమోదం లేదు. సిమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియా వనరులను పెట్టుబడి పెట్టడంలో వైఫల్యం లాంటి అనేక ఇతర అవకతవకలను కూడా దర్యాప్తులో బయటపెట్టింది. ప్రాజెక్ట్ కోసం కేటాయించిన నిధులను షెల్ కంపెనీలలోకి పంపారు. సీమెన్స్ గ్లోబల్ కార్పొరేట్ ఆఫీస్ ఈ ప్రాజెక్ట్‌పై అంతర్గత దర్యాప్తులో ప్రాజెక్ట్ మేనేజర్ హవాలా లావాదేవీల ద్వారా ప్రభుత్వం కేటాయించిన సొమ్మును షెల్ వ్యాపారాలకు మళ్లించాడని తేలింది. అందుకే ఆయన్ను విధుల నుంచి తొలగించారు. ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు నైపుణ్యం అభివృద్ధి కోసం ఆరు ఎక్స్‌లెన్స్ కేంద్రాలను అభివృద్ధి చేసే పనిని సిమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియాకు అప్పగించారు. ప్రాజెక్టులో సీమెన్స్ సంస్థ వాటా 90శాతం ఉండగా.. రాష్ట్రప్రభుత్వం వాటా 10శాతం ఉంది. సీమెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆ MOU పక్కనపెట్టారనే ఆరోపణలున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు