కదలని బస్సులు.. డిపోల వద్దే కొనసాగుతోన్న నిరసనలు.. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో..!

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిరసనలు ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసే బిల్లుపై గవర్నర్‌ తమిళిసై ఇప్పటివరకు అంగీకరం చెప్పకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బస్సు డిపోల వద్ద ఆందోళనలకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమిళిసైకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరుకే బస్సులు బంద్‌ అని చెప్పినా.. ఆ తర్వాత కూడా కొన్ని డిపోల్లో బస్సులు కదలని పరిస్థితి కనిపిస్తుంది.

కదలని బస్సులు.. డిపోల వద్దే కొనసాగుతోన్న నిరసనలు.. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో..!
New Update

TSRTC Buses on strike: చాలా డిపోల్లో టీఎస్‌ఆర్టీసీ బస్సులు(TSRTC Buses) కదలడం లేదు. నిజానికి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే బస్సులు బంద్‌ అని చెప్పినా.. కొన్ని చోట్ల మాత్రం బస్సులు ఇప్పటికీ డిపోలకే పరిమితమయ్యాయి. టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌ ఎటూ తేల్చకపోవడంతో ఆగ్రహంగా ఉన్న కార్మికులు నిరసనలను ఉధృతం చేసేలాగా కనిపిస్తున్నారు. బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. పీవీ మార్గ్‌ రూట్‌లో రాజ్‌భవన్‌కి చేరుకునేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమయ్యారని సమాచారం. ఈలోపే గవర్నర్‌ తమిళిసై (Governor Tamilisai) బిల్లుపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవాళ 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. నిన్న అర్థరాత్రి సమయంలో రాజ్‌భవన్‌ నుంచి కీలక్‌ అప్‌డేట్ వచ్చింది. టీఎస్‌ఆర్టీసీ(TSRTC Bill) బిల్లు గురించి మరింత వివరణ కావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు గవర్నర్‌ తమిళిసై. ఎంత త్వరగా వివరణ ఇస్తే అంతే త్వరగా బిల్లుపై ఓ నిర్ణయం తీసుకుంటారని రాజ్‌భవన్‌(Raj Bhavan) వర్గాలు చెబుతున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాల ముగింపునకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ బిల్లుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడుతుందా..లేదా ఇలానే కొనసాగుతుందా.. బిల్లుకు గవర్నర్ ఆమోదిస్తారా.. ప్రభుత్వం బిల్లును ప్రవేశపెడుతుందా లాంటి ప్రశ్నలు ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్నాయి. అందుకే తమ నిరసన అస్త్రాన్ని బయటకు తీశారు కార్మికులు. తాడోపెడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.

మరోవైపు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి డిపోల్లో ఆందోళలను చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్‌ తమిళిసై గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని.. లేకపోతే కార్మికులంతా రాజ్ భవన్‌ను ముట్టడిస్తారని హెచ్చరిస్తున్నారు. మేడ్చల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా కొనసాగుతూనే ఉంది. ఉదయం 6 గంటల నుంచి బస్సు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగడంతో ఫస్ట్ షిఫ్ట్‌లో 122 బస్సులు కదలలేదు. అటు హయత్ నగర్‌లోనూ ఆర్టీసీ డిపో నుంచి బస్సులు కదలలేదు. అటు తెలంగాణ రాష్ట్ర మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిపోల ముందు పెద్ద ఎత్తున కార్మికులు ధర్నా చేపట్టారు. కూకట్ పల్లి బస్సు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. గతంలో దాదాపు రెండు నెలల పాటు ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెను మరువద్దని.. గవర్నర్‌ ఈ బిల్లుకు ఆమోదం తెలపాల్సిందేనంటున్నారు కార్మికులు.

Also Read: గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తాం: బండి

#tsrtc #tsrtc-staff #cmkcr #tsrtc-buses-strike #tsrtc-staff-protests #telangana-rtc-bill #tsrtc-bill #rajbhavan #governor-tamilisai #hyderabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి