Health Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ పానీయాలు తీసుకుంటే సెట్‌..

బరువు తగ్గిందేకు కొన్ని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొన్ని జ్యూస్‌లు తాగితే ఆశించిన ఫలితాలిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దాన్నిమ్మ, బ్లూబెర్రీస్‌ యాపిల్, క్రాన్‌బెర్రీ, టార్ట్‌ చెర్రీ జ్యూస్‌లను తీసుకుంటే బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయని అంటున్నారు.

Health Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ పానీయాలు తీసుకుంటే సెట్‌..
New Update

Weight Loss Tips : లావుగా ఉండే చాలామంది బరువు తగ్గాలనుకుంటారు. ఇందుకోసం జిమ్‌(Gym) లో గంటల తరబడి కసరత్తులు చేస్తుంటారు. కానీ అనుకున్నంత బరువు తగ్గిపోలేదని వాపోతుంటారు. అయితే ఈ విషయంపై పలువురు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వ్యాయామం(Exercise) లో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే బరువు తగ్గాలనుకునేవారికి ఆశించిన ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

అలాగే బరువు తగ్గేందుకు(Weight Loss) కొన్ని పానీయాలు కూడా శరీరానికి ప్రయోజనాలను చేకూరుస్తాయని అంటున్నారు. ఐదు రకాల ఫ్రూట్‌ జ్యూస్ రుచిగా ఉండటంతో సహా.. బరువు తగ్గే ప్రక్రియను సరళతరం చేస్తాయని చెబుతున్నారు. దానిమ్మ జ్యూస్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి బరువు తగ్గించేందుకు సహకరిస్తాయి. తక్కువ క్యాలరీలతో ఉండే దానిమ్మ జ్యూస్‌ తాగితే బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

Also Read: ఊబకాయం వల్ల శరీరం రూపురేఖలు మారిపోయాయా..? అయితే ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తే బరువు ఇట్టే తగ్గిపోతారు!

మరోవిషయం ఏంటంటే ఈ దానిమ్మ జ్యూస్‌లో పాలీపెనాల్స్‌, ఆంథోసియానిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీవక్రియల వేగాన్ని పెంచి బరువును నియంత్రణలో ఉంచుతాయి. అంతేకాదు ఈ జ్యూస్‌ తీసుకుంటే పలు రకాల వ్యాధులు కూడా దరిచేరవు. ఈ జ్యూస్‌ను ఇత ఫ్రూట్, వెజిటేబుల్‌ జ్యూస్‌లతో కలిపి తీసుకోవచ్చు.

బ్లూబెర్రి జ్యూస్.. మెటబాలిజనాన్ని పరుగులు పెట్టించి బరువును తగ్గించేందుకు ఉపకరిస్తుంది. అంతేకాదు ఈ జ్యూస్‌ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ బ్లూబెర్రీస్‌లో ఉండే మాంగనీస్, పొటాషియం శరీరంలో కొవ్వులను కరిగించేందుకు తోడ్పడతాయి. అంతేకాదు ఇందులో ఉండే ఫైబర్‌ కడుపు నిండిన భావనను కలగిస్తుంది. దీనివల్ల ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. దాన్నిమ్మ, బ్లూబెర్రీస్‌ జ్యూస్‌లతో పాటు.. యాపిల్, క్రాన్‌బెర్రీ, టార్ట్‌ చెర్రీ జ్యూస్‌లను తీసుకుంటే బరువు తగ్గేందుకు ఎంతగానో సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read: చలికాలంలో గుండెను ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలంటే!

#health-tips #health-news #lifestyle #best-juices-for-weight-loss
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe