USA: నా ప్రాణాలు కాపాడావు ..మహిళకు ట్రంప్ కృతజ్ఞతలు

పెన్సెల్వేనియాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మీద అటాక్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ దాడిలో ఆయన ప్రాణాలతో బతికి బయటపడ్డారు. దానికి కారణం ఒక మహిళ అంట. అందుకే ఆమెకు ట్రంప్ స్టేజ్‌ మీదకు పిలిచి మరీ కృతజ్ఞతలు చెప్పారు.

New Update
USA: నా ప్రాణాలు కాపాడావు ..మహిళకు ట్రంప్ కృతజ్ఞతలు

Donald Trump: అమెరికాలో ట్రంప్ మీదజరిగిన అటాక్ మామూలు విషయం కాదు. మొత్తం ప్రపంచం అంతా ఒక్కసారి ఉలిక్కిపడింది ఈ సంఘటనతో. ఈ దాడిలో ట్రంప్ అయితే తప్పించుకున్నారు. చెవికి చిన్న గాయంతో బయటపడ్డారు. దానికి కారణం ఒక మహిళ అంట. అదెలా జరిగిందో కూడా ఆయన వివరించారు. అసలేం జరిగిందంటే..దుండగుడు కాల్పులు జరపడానికి కొన్ని నిమిషాల ముందు కంప్యూటర్‌ సెక్షన్‌ సిబ్బందిలో ఒక మహిళ రెఫ్యూజీస్ చార్ట్‌ను స్క్రీన్‌పై ప్రదర్శించింది. దాన్ని చూసేందుకు ట్రంప్ తన తలను అటు వైపు తిప్పారుట. అదే టైమ్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. దాంతో అతను కాల్చిన బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ పోయింది. లేకుంటే అది ఆయన మొహంలోకి డైరెక్ట్‌గా దూసకెళ్ళేది. ఆ విధంగా ఆ మహిళ  ట్రంప్ ప్రాణాలు కాపాడింది. ఈ కారణంగానే ఆయన ఆమె వల్లే ఈ రోజు ప్రాణాలతో ఉన్నాను అని చెప్పుకుంటున్నారు.

ఆ మహిళ చేసిన దానికి ట్రంప్ కృతజ్ఞతలు చెప్పుకొన్నారు.హారిస్‌బర్గ్‌ ప్రచార సభలో ఆ మహిళను వేదిక పైకి పిలిచి ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను కంప్యూటర్‌ జీనియస్‌ అంటూ పొగిడారు కూడా. మరోవైఉ కాల్పులు జరిగిన తర్వాత కూడా ట్రంప్ తన ప్రచారాన్ని ఆపేదు. మధ్యలో ఆపేస్తారు అంటూ వార్తలు వస్తున్నా..ఆయన మాత్రం తన కాళ్ళకు చక్రాలు కట్టుకుని మరీ తిగేస్తున్నారు. ఇప్పుడు ఎక్క అయితే హత్యాప్రయత్నం జరిగిందో అక్కడే మళ్ళీ ప్రచార సభను నిర్వహించారు. ఆ సభలోనే మహిళకు కృతజ్ఞతలు కూడా చెప్పారు.

Also Read:Rahul Gandhi: రాహుల్ కుట్టిన షూస్‌కు సూపర్ డిమాండ్

Advertisment
తాజా కథనాలు