Director Prasanth Varma:ఏంటి అప్పుడే అంత పెరిగిందా..హనుమాన్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్

New Update
Director Prasanth Varma:ఏంటి అప్పుడే అంత పెరిగిందా..హనుమాన్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్

Social Media trolling:అ!, కల్కి, జాంబిరెడ్డి, హనుమాన్...ప్రశాంత్ వర్మ ఇప్పటి వరకు తీసిన సినిమాలు. మొదటి మూడు సినిమాలు సోసోగా ఆడాయి. తెలుగులో మంచి పేరునే తెచ్చుకున్నా కలెక్షన్ల పరంగా మాత్రం పెద్ద సక్సెస్ కాలేదు. కానీ నాలుగో సినిమా హనుమాన్ మాత్రం సూపర్ డూపర్ హిట్. ఒక్క తెలుగులోనే కాదు ఇండియాలోని మిగతా అన్ని భాషల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ప్రశాంత్ వర్మకు మంచి ఫేమ్ వచ్చింది. సినిమా విడుదల అయిన తర్వాత ప్రశాంత్ వర్మ చాలాచోట్ల ఇంటర్వూలు ఇస్తున్నాడు. ఇలా ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలే ఇప్పుడు ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఒక్క సినిమా సక్సెస్ అవ్వగానే ప్రశాంత్‌కు కళ్ళు నెత్తికెక్కాయని నెటిజన్లు అంటున్నారు. ఒక్క సినిమా సక్సెస్ అయితే మరీ ఇంతలా ఎగిరెగిరి పడకూడదని సలహాలు ఇస్తున్నారు.

Also read:USA:సాయం చేసిన వ్యక్తినే దారుణంగా చంపేశాడు..యూఎస్‌లో బలయిన భారతీయ విద్యార్ధి

అసలేమన్నాడు అంటే...

ప్రశాంత్ వర్మకు మొదటి నుంచీ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. ప్రపంచస్థాయి సినిమాలు తీస్తానని అప్పటి నుంచే అతను అంటుండేవాడు కూడా. అయితే హనుమాన్‌కు ముందే ప్రశాంత్‌ను ట్రోల్ చేసేవాళ్ళు. కానీ హనుమాన్ సినిమా తర్వాత ఆగిపోయింది. పరిమిత బడ్జెట్‌లో అతను తీసిని హనుమాన్ సినిమా అద్భుతాలను సృష్టించింది. అయితే ఈ మధ్య ప్రశాంత్ బాలీవుడ్‌లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆది పురుష్ గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాదానంగా తానైతే ఆ సినిమాను ఇంకా బాగా తీస్తానని అన్నాడు ప్రశాంత్ వర్మ. ఓం రౌత్ కొన్ని సీన్లు బాగానే తీశాడని..కొన్ని మాత్రం అస్సలు నచ్చలేదని చెప్పాడు. తానైతే ఇంకా బాగా తీసేవాడినని అన్నాడు. పైగా నాకే కాదు ఏ ఫిల్మ్ మేకర్‌కు అయినా అలాగే అనిపిస్తుంది అంటూ కామెంట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రాజమౌళి మీద కూడా కామెంట్స్...

అలాగే రాజమౌళి మీద కూడా కామెంట్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరేందుకు రాజమౌళి దగ్గరకు వెళ్ళానని...తనను తీసుకోలేదని చెప్పాడు ప్రశాంత్ వర్మ. టీమ్‌లో ఖాళీ లేదని తిరస్కరించారు. దాంతో ఆయన మీద కోపం వచ్చిందని చెప్పుకొచ్చాడు. అలాగే రాజమౌళి భారతం సినిమా తీయకపోతే తాను తీస్తానని చెప్పాడు ప్రశాంత్ వర్మ. దాంతో పాటూ పెద్ద హీరోలతో సినిమాలు చేయనని చెప్పుకొచ్చాడు. పెద్ద హీరోల డేట్ల కోసం రోజుల తరబడి వెయిట్ చేయాలి...అలా చేసి చాలా రోజులు టైమ్ వేస్ట్ కూడా చేసాను. కానీ ఇక మీదట తాను అలా చేయనని...టామ్ క్రూజ్ లాంటి పెద్ద హీరో వచ్చి అడిగినా చేయనని చెప్పాడు.

ఈరెండు ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. అంతేకాదు ప్రశాంత్ ఎక్కువ మాట్లాడుతున్నాడని ట్రోల్ చేస్తున్నారు. ఒక్క సినిమాకే పెద్ద డైరెక్టర్లను, హీరోలను మాటలు అంటున్నాడని క్లాసులు పీకుతున్నారు. కాన్ఫిడెన్స్ మంచిదే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా చూసుకుంటే మంచిదని అంటున్నారు. లేకపోతే తరువాత వచ్చే సినిమాలు హిట్ అవ్వకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు