బన్నీ పక్కన త్రిషనా..మరోసారి ఆలోచించండి త్రివిక్రమ్‌ గారు!

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ బన్నీ కాంబినేషన్‌ లో రాబోతున్న నాలుగో సినిమాకి త్రిషను హీరోయిన్‌ గా ఎంచుకున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి కాంబినేషన్‌ సెట్‌ కాదని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

బన్నీ పక్కన త్రిషనా..మరోసారి ఆలోచించండి త్రివిక్రమ్‌ గారు!
New Update

గత నాలుగు రోజుల నుంచి సోషల్‌ మీడియాలో కానీ, సినీ ఇండస్ట్రీలో కానీ బాగా వినిపిస్తున్న నటి పేరు త్రిష. నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ ఆమె మీద చేసిన వ్యాఖ్యల వల్ల ఆమె సినీ ప్రపంచం మొత్తం అండగా నిలిచింది. దీంతో అటు తమిళ్‌, తెలుగు రెండు పరిశ్రమల్లో కూడా ఆమె పేరు మారుమోగుతుంది.

లియో చిత్రం ఘన విజయం సాధించడంతో ఆమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ..మాటల మాంత్రికుని కన్ను ఈ ముద్దుగుమ్మ మీద పడినట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్‌ మహేశ్‌ బాబుతో గుంటూరు కారం సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నట్లు సమాచారం.

ఆ తరువాత అల్లు అర్జున్‌ తో సినిమా తీయనున్నట్లు ఇంతకు ముందే వీరు ప్రకటించారు. ఇప్పటికే బన్నీతో గురూజీ మూడు సినిమాలు తీసి సూపర్‌ హిట్లు అందుకున్నాడు. నాలుగో సారి వీరి నుంచి సినిమా వస్తుండడంతో అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు హీరోయిన్‌ కోసం వెదుకులాట ప్రారంభించారు.

ఈ క్రమంలో త్రివిక్రమ్‌ కన్ను త్రిష మీద పడినట్లు సమాచారం. బన్నీకి త్రిష జంటగా బాగుటుంది. త్రిష బన్నీ కంటే ఏడాది చిన్నది కూడా. కానీ సినీ అభిమానులు మాత్రం వీరిద్దరి కాంబో బాగోదేమో గురూజీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వీరిద్దరూ చూడటానికి అక్క తమ్ముళ్లు లాగా ఉంటారని వారు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

త్రిషకు బన్నీకి రొమాన్స్‌ సెట్‌ అవ్వదని కొందరూ చెప్పుకొస్తున్నారు. త్రిష ఇప్పటికే ఇండస్ట్రీలో అగ్ర హీరోలైన చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, వెంకటేశ్‌, మహేష్‌ బాబు, ప్రభాస్‌ వంటి నటులతో చేసి మెప్పించింది. త్రిష బన్నీకి సరిపోదని ఎందుకు అంటున్నారంటే..గత కొంత కాలంగా త్రిష గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటుంది.

అందుకే.. గురూజీ.. మరోసారి ఆలోచించు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Also read: భద్రాద్రి రామయ్య భక్తులకు శుభవార్త…ఆన్‌ లైన్ లో వైకుంఠ ఏకాదశి టికెట్లు!

#trisha #virul #movie #trivikram #bunny
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe