భద్రాద్రి రామయ్య భక్తులకు శుభవార్త...ఆన్ లైన్ లో వైకుంఠ ఏకాదశి టికెట్లు! భద్రాచలం లో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం వీక్షించేందుకు వివిధ సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఈ సెక్టార్లను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవాలని ఆమె వివరించారు. By Bhavana 22 Nov 2023 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి భద్రాద్రి రామయ్య భక్తులకు దేవాలయాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతి ఏడాది భద్రాద్రి రాముల వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సం సమయంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఈ ఏడాది ఆ పర్వదినం డిసెంబర్ 23న వచ్చింది. ఆ రోజున ఉదయం 5 గంటలకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఈ ప్రత్యేక పూజలో పాల్గొనే భక్తులు కూర్చునేందుకు ఆలయంలో వివిధ సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. అందుకు గానూ రూ. 2000, రూ.1000, రూ.500, రూ. 250 చెల్లింపుతో టికెట్లు తీసుకున్న వారికి ఆయా సెక్టార్లలోకి ప్రవేశం ఉంటుందని ఈవో వివరించారు. ఈ టికెట్లు https://bhadradritemple.telangana.gov.in వెబ్సైట్లో నేటి (నవంబర్ 22) నుంచి అందుబాటులో ఉంటాయని ఈవో వెల్లడించారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారు ఒరిజినల్ టికెట్లను డిసెంబర్ 13 నుంచి 23 వ తేదీ వరకు ఉదయం 5 గంటల లోపు రామాలయ కార్యాలయంలో తీసుకోవాలని సూచించారు. ఆలయం వద్దకు రాలేని వారికి ఆన్ లైన్ లో టికెట్ రుసుము చెల్లించి తమ గోత్ర నామాలతో పూజ చేయించుకునే వెసులుబాటునూ కల్పించినట్లు ఆలయ ఈవో రమాదేవి స్పష్టం చేశారు. Also read: పొట్టి ఫైట్‌కు విశాఖ రెడీ.. తెలుగు కుర్రాడు తిలక్‌వైపే అందరి చూపు! #online #sectors #vaikuntaekadasi #badrachalam #eo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి