మరో వివాదంలో త్రిష.. ఇదేం పద్దతంటూ తిట్టిపోస్తున్న జనం

నటి త్రిషపై నెట్టింట దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. 'యానిమల్' సినిమాలో బోల్డ్ సీన్స్ ను పొగుడుతూ ‘కల్ట్‌ మూవీ’ అంటూ ఆమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఇన్నాళ్లు ఆడవాళ్ల హక్కుల గురించి మాట్లాడిన నీకు ఇప్పుడు స్త్రీలను కించపరిచే సినిమా ఎలా నచ్చిందంటూ తిట్టిపోస్తున్నారు.

మరో వివాదంలో త్రిష.. ఇదేం పద్దతంటూ తిట్టిపోస్తున్న జనం
New Update

Unforgettable Controversies Of Trisha : సీనియర్ నటి త్రిష (Trisha) మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే మన్సూర్ అలీ (Mansoor Ali)తో ఇష్యూ కారణంగా వార్తల్లో నిలిచినటి.. 'యానిమల్' సినిమాలోని బోల్డ్ సన్నివేశాలపై తన ఫీలింగ్స్ బయటపెట్టడం వివాదాస్పమైంది. దీంతో నీవు చేస్తే సంసారం మంది చేస్తే వ్యభిచారమా? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్సూర్ ఇష్యూలో ఉమెన్ కార్డ్ వాడుతూ రచ్చకెక్కిన నీకు నోటీదూల ఎక్కువే అంటూ దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు.

publive-image

Also read :మాంచి ఊపుమీదున్న బాలయ్య.. ఒకేసారి ముగ్గురు భామలతో రొమాన్స్!

ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవలే ఆమె ‘యానిమల్‌’ సినిమా చూసినట్లు తెలిపింది. అయితే ఆ సినిమా అమ్మడికి తెగ నచ్చేసినట్టుంది. దీంతో ఎగ్జయిట్ అయిన నటి ఆనందంలో 'యానిమల్'(Animal) పోస్టర్ ను ఇన్ స్టాలో షేర్ చేస్తూ ‘కల్ట్‌ మూవీ’ అంటూ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఇక ఆ సినిమా నచ్చని వాళ్లంతా త్రిషపై దండెత్తారు. ‘ఆడవాళ్లు.. హక్కులూ.. ఆత్మాభిమానాలూ అంటూ మాట్లాడతావ్‌.. ఇలా స్త్రీలను అవమానించేలా తీసిన సినిమాలను మాత్రం పొగిడేస్తుంటావ్‌.. నీ పద్ధతి ఏం నచ్చ లేదు.’ అంటూ విమర్శలు గుప్పించారు.

దాంతో ఈ వ్యతిరేకతను తట్టుకోలేక తన ఇన్‌స్టా స్టోరీని తొలగించేసింది త్రిష. మరికొంతమంది త్రిష ఫ్యాన్స్ మాత్రం ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఆమె చెప్పినదాంట్లో తప్పేముందని, నచ్చింది నచ్చినట్లు చెప్పడం మంచిదే కదా అంటూ మద్ధతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఇష్యూ నెట్టింట చర్చనీయాంశమైంది.

#tollywood #animal #actress #trisha #trolling #unforgettable-controversies-of-trisha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe